ఎన్టీఆర్ చిత్రంలో విలన్ కన్నడ స్టార్
Send us your feedback to audioarticles@vaarta.com
జనతా గ్యారేజ్ సూపర్‌సక్సెస్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఎన్టీఆర్ట్స్ బ్యానర్‌పై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న చిత్రం `జై లవకుశ`. ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తాడని వార్తలు వినపడుతున్నాయి. ఒక పాత్రలో ఎన్టీఆర్ నెగటివ్ షేడ్‌తో పాటు నత్తి కూడా ఉన్నట్లు నటిస్తాడట. రాశిఖన్నా, నివేదాథామస్ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి బాబీ దర్శకుడు.
ప్రస్తుతం సినిమా శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది. ఈ సినిమాలో విలన్‌గా కన్నడ వివాదస్పద నటుడు దునియా విజయ్ నటించబోతున్నాడని టాక్ వినపడుతుంది. విలన్‌గా ఎవరు నటిస్తారనే దానిపై త్వరలోనే క్లారిటీ రానుంది. సమంత ఈ చిత్రంలో అతిథిపాత్రలో కనపడనుందని కూడా ఫిలింనగర్ వర్గాల సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments