బన్నీ చిత్రంలో కన్నడ స్టార్ హీరో ..?
Send us your feedback to audioarticles@vaarta.com
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘పుష్ప’. భారీ బడ్జెట్‌తో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా పాన్ ఇండియా చిత్రంగా విడుదలవుతుంది. పాన్ ఇండియా సినిమాగా సినిమాను ఆవిష్కరించడానికి సుకుమార్ అండ్ టీమ్ బాగానే కష్టపడుతున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో నటీనటులను ఇందులోకి తీసుకొస్తున్నాడట సుకుమార్. లేటెస్ట్ సమాచారం మేరకు పుష్పలో కన్నడ స్టార్ హీరో దర్శన్‌ను నటింప చేయాలని సుకుమార్ ట్రై చేస్తున్నాడట. ఇప్పటికే దర్శన్‌కి కథను, అతని క్యారెక్టర్‌ను వివరించాడట. మరి దర్శన్ ఓకే అంటాడో లేదో చూడాలి.
మైత్రీమూవీస్, ముత్యం శెట్టి మీడియా బ్యానర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంటే ఓ బాలీవుడ్ బ్యూటీ స్పెషల్ సాంగ్‌లో నర్తించనుందట. అలాగే ఓ బాలీవుడ్ నటుడిని విలన్‌గా నటింప చేయాలనుకుంటున్నాడ సుక్కు. చిత్తూరు జిల్లా శేషాచల అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సినిమా తెరకెక్కనుంది. రీసెంట్‌గా బన్నీ పుట్టినరోజున అనౌన్స్ చేసిన ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా కోసం బన్నీ చిత్తూరుజిల్లా యాసను ప్రత్యేకంగా నేర్చుకున్నాడు. కరోనా ప్రభావం తగ్గగానే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments