మహేశ్‌ని ఢీ కొట్టబోతున్న కన్నడ స్టార్
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేశ్ తన 27వ సినిమాగా `సర్కారు వారి పాట` అనే సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా టైటిల్ లోగోను విడుదల చేసి సినిమాలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సినిమాలో విలన్‌గా ఎవరు నటిస్తారు? అనే దానిపై పలు వార్తలు వినపడ్డాయి. కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ఈ చిత్రంలో విలన్‌గా చేస్తాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కన్నడ స్టార్ సుదీప్ ‘సర్కారు వారి పాట’లో విలన్‌గా నటించబోతున్నాడంటూ వార్తలు వినపడుతున్నాయి. హీరోయిన్గా కూడా బాలీవుడ్ హీరోయిన్స్ కియారా అద్వాని, సయీ మంజ్రేకర్, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే పేర్లు పరిశీలనలో ఉన్నాయట. హీరోయిన్ ఎవరు? విలన్ ఎవరు? అనే దానిపై దర్శక నిర్మాతలు త్వరలోనే క్లారిటీ ఇస్తారట.
‘సర్కారు వారి పాట’ ఎంటర్టైన్మెంట్తో పాటు పవర్ఫుల్ మెసేజ్ కూడా ఉంటుందని ఇటీవల మహేశ్ తెలియజేసిన సంగతి తెలిసిందే. బ్యాంకులను మోసం చేసిన విలన్ నుండి తిరిగి డబ్బులు రాబట్టే కథే ఈ సినిమా అని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. త్వరలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్ ప్లస్ బ్యానర్స్‌పై సినిమా నిర్మితమవుతోంది. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. పి.ఎస్.వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com