నెలల వ్యవధిలో కన్నడ స్టార్ హీరో ఇంట్లో మరో విషాదం
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ కన్నడ నటుడు దునియా విజయ్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి రుద్రప్ప (81) కన్నుమూశారు. వయసు సంబంధిత అనారోగ్య సమస్యలతో బెంగళూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో రుద్రప్ప మూడు రోజుల క్రితం చేరారు. ఈ నేపథ్యంలో అక్కడ చికిత్స పొందుతూ ఆయన నిన్న కన్నుమూశారు.
శుక్రవారం వారి స్వగ్రామం అనేకల్ తాలుకా కుంబారహళ్లి గ్రామంలో రుద్రప్ప అంత్యక్రియలు ముగిశాయి. కాగా విజయ్ తల్లి నారాయణమ్మ కూడా ఈ ఏడాది జులైలో అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. నెలల వ్యవధిలోనే తండ్రి కూడా మరణించడంతో విజయ్ తీవ్ర విషాదంలో కూరుకుపోయారు. కన్నడలో విలన్, రౌడీ క్యారెక్టర్స్‌తో మంచి పేరు తెచ్చుకున్న విజయ్ .. 'దునియా' సినిమాతో హీరోగా మారాడు. అప్పటి నుంచి ఆ సినిమా పేరు ఆయన ఇంటి పేరుగా మారిపోయింది.
కాగా.. కొన్నేళ్ల క్రితం మొదటిభార్య నాగరత్న నుంచి విడాకులు తీసుకోవాలని విజయ్ సిద్ధమవడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. నాగరత్న, ఆమె పిల్లలు– దునియా విజయ్, అతని రెండవ భార్య కీర్తిల మధ్య తరచూ గొడవలు జరుగుతుండడం.. విషయం పోలీసు స్టేషన్ వరకు వెళ్లడంతో విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నాడని అప్పట్లో ప్రచారం జరిగింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments