కరోనాను జయించిన సింగర్ కనికా కపూర్!
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ ప్రముఖ సింగర్ కనికా కపూర్ ఎట్టకేలకు కరోనా నుంచి బయటపడింది. ఇప్పటి వరకూ నాలుగుసార్లు జరిపిన టెస్టుల్లో పాజిటివే రాగా.. తాజాగా నెగిటివ్ వచ్చింది. అంటే ఐదోసారి టెస్ట్ చేయగా నెగిటివ్ రావడం మంచి పరిణామమమే. ప్రస్తుతం లక్నోలోని సంజయ్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆస్పత్రిలోనే స్వీయ నిర్బంధంలో ఉంది. కాగా.. ఇంకొన్ని సార్లు రిపోర్టులు నెగిటివ్ వచ్చేంతవరకూ ఆస్పత్రిలోనే ఉండాలని వైద్యులు సూచించారని తెలుస్తోంది. నెగిటివ్ రిపోర్ట్ రావడంపై కుటుంబ సభ్యులు, మిత్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. మార్చి 9, 2020 నాడు కనికా లండన్ నుంచి ముంబై వచ్చిందని.. అయితే ఆమె ఒక భయంకరమైన క్రిమితో యుద్ధం చేయాల్సి వస్తుందని తాము ఊహించలేదన్నారు.
ఇదిలా ఉంటే.. నెగిటివ్ వచ్చిన తర్వాత 8 రోజులపాటు వైద్యులు టెస్ట్లు చేస్తారు. ఆ టెస్టుల్లో కూడా నెగిటివ్ వస్తే కనికా పూర్తిగా కరోనాపై విజయం సాధించినట్లే కాగా.. ఎక్కువ రోగ నిరోధక శక్తి ఉన్న వాళ్లు కరోనాను చాలావరకు దేశ వ్యాప్తంగా జయిస్తున్న సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout