కరోనాను జయించిన సింగర్ కనికా కపూర్!

  • IndiaGlitz, [Saturday,April 04 2020]

బాలీవుడ్ ప్రముఖ సింగర్ కనికా కపూర్ ఎట్టకేలకు కరోనా నుంచి బయటపడింది. ఇప్పటి వరకూ నాలుగుసార్లు జరిపిన టెస్టుల్లో పాజిటివే రాగా.. తాజాగా నెగిటివ్ వచ్చింది. అంటే ఐదోసారి టెస్ట్ చేయగా నెగిటివ్ రావడం మంచి పరిణామమమే. ప్రస్తుతం లక్నోలోని సంజయ్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆస్పత్రిలోనే స్వీయ నిర్బంధంలో ఉంది. కాగా.. ఇంకొన్ని సార్లు రిపోర్టులు నెగిటివ్ వచ్చేంతవరకూ ఆస్పత్రిలోనే ఉండాలని వైద్యులు సూచించారని తెలుస్తోంది. నెగిటివ్ రిపోర్ట్ రావడంపై కుటుంబ సభ్యులు, మిత్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. మార్చి 9, 2020 నాడు కనికా లండన్ నుంచి ముంబై వచ్చిందని.. అయితే ఆమె ఒక భయంకరమైన క్రిమితో యుద్ధం చేయాల్సి వస్తుందని తాము ఊహించలేదన్నారు.

ఇదిలా ఉంటే.. నెగిటివ్ వచ్చిన తర్వాత 8 రోజులపాటు వైద్యులు టెస్ట్‌లు చేస్తారు. ఆ టెస్టుల్లో కూడా నెగిటివ్ వస్తే కనికా పూర్తిగా కరోనాపై విజయం సాధించినట్లే కాగా.. ఎక్కువ రోగ నిరోధక శక్తి ఉన్న వాళ్లు కరోనాను చాలావరకు దేశ వ్యాప్తంగా జయిస్తున్న సంగతి తెలిసిందే.

More News

ఎంతో గర్వంగా ఉంది.. సీసీసీకి 2 లక్షలిస్తున్నాం: శివాని, శివాత్మిక

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వైరస్‌పై పోరాటం చేస్తున్నాయి.

నిజాముద్దీన్ ఘటనతో తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తోన్న కరోనా!

కరోనా మహామ్మారి తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకూ విస్తరిస్తోంది. ఎప్పుడైతే ఢిల్లీ నిజాముద్దీన్ ఘటన వెలుగుచూసిందో ఆ రోజు నుంచి ఏపీ, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు అమాంతం పెరిగిపోతున్నాయి.

కరోనాపై పోరుకు నయన్ భారీ విరాళం..

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వైరస్‌పై పోరాటం చేస్తున్నాయి. ఈ క్రమంలో

థమన్‌ను ఫాలో అవుతున్న పవన్.. లవ్యూ సర్..!

టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈయనకు ఫాలోయింగ్ యూత్‌లోనే కాదు.. సినీ ఇండస్ట్రీలో కూడా ఉంటారన్న విషయం తెలిసిందే.

'ఆర్ఆర్ఆర్‌' విడుద‌ల‌పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత‌

రాజమౌళి, ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న‌ ప్రెస్టీజియ‌స్ మూవీ ‘రౌద్రం ర‌ణం రుధిరం’. ఇప్ప‌టికే 75 శాతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న