రణదీప్ హుడా కంగనా సోదరి ఫైర్
Send us your feedback to audioarticles@vaarta.com
2019లో ఉత్తమ నటి ఎవరు? అనే సర్వే నిర్వహించింది. అందులో కంగనా, ఆలియా భట్ మధ్య పోటీ నెలకొందని సదరు పత్రిక తెలియజేసింది. అయితే కంగనా, ఆలియా మధ్య మాటల యుద్ధం అక్కడి నుండే మొదలైంది. `ఆలియా ఓ సాధారణ నటి.. ఆమెతో నన్ను పోల్చడం ఇబ్బందిగా ఉంది` అంటూ కామెంట్ చేసింది. అప్పటి నుండి ఇద్దరి మధ్య ఏదో ఒక సందర్భంలో మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. ఈ యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనపడటం లేదు. ఇప్పుడు ఈ యుద్ధంలోకి రణదీప్ హుడా కూడా చేరాడు.
ఆలియా భట్‌ను పొగుడుతూ రణదీప్ హుడా ఓ ట్వీట్ చేశాడు. ``ప్రియమైన ఆలియా నీపై విమర్శలు చేసే వారిని పట్టించుకోకుండా, నీ పని నువ్వు చేసుకుంటూ ముందుకు పోతున్నావ్. నిన్ను నువ్వు నిరూపించుకుంటున్నందుకు చాలా గర్వపడుతున్నాను`` అంటూ రణదీప్ పేర్కొన్నాడు. ఎక్కడా కంగనా పేరుని ప్రస్తావించలేదు. అయితే రణదీప్ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే కంగనా సోదరి రంగోలి రణదీప్ హుడాను విమర్శిస్తూ ట్వీట్స్ చేస్తూ వచ్చారు.
``నువ్వు కరణ్ జోహార్‌కు అభిమానివి. అందుకే బంధు ప్రీతిని ప్రోత్సహిస్తూ ఆలియాను పొగుడుతున్నావు. ఆలియాలాంటి వాళ్లు కనీసం చెంచాగిరి చేసైనా విజయం సాధిస్తున్నారు. నువ్వింకా ఫెయిల్యూర్ యాక్టర్‌వే. ఉంగ్లీ సినిమా సమయంలో నువ్వు కంగనాని ఎంత ఇబ్బంది పెట్టావో నాకు తెలుసు`` అంటూ రంగోలి తెలిపారు. మరి దీనిపై ఆలియా భట్ ఎలా స్పందిస్తారో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments