రణదీప్ హుడా కంగనా సోదరి ఫైర్
- IndiaGlitz, [Wednesday,April 17 2019]
2019లో ఉత్తమ నటి ఎవరు? అనే సర్వే నిర్వహించింది. అందులో కంగనా, ఆలియా భట్ మధ్య పోటీ నెలకొందని సదరు పత్రిక తెలియజేసింది. అయితే కంగనా, ఆలియా మధ్య మాటల యుద్ధం అక్కడి నుండే మొదలైంది. 'ఆలియా ఓ సాధారణ నటి.. ఆమెతో నన్ను పోల్చడం ఇబ్బందిగా ఉంది' అంటూ కామెంట్ చేసింది. అప్పటి నుండి ఇద్దరి మధ్య ఏదో ఒక సందర్భంలో మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. ఈ యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనపడటం లేదు. ఇప్పుడు ఈ యుద్ధంలోకి రణదీప్ హుడా కూడా చేరాడు.
ఆలియా భట్‌ను పొగుడుతూ రణదీప్ హుడా ఓ ట్వీట్ చేశాడు. ''ప్రియమైన ఆలియా నీపై విమర్శలు చేసే వారిని పట్టించుకోకుండా, నీ పని నువ్వు చేసుకుంటూ ముందుకు పోతున్నావ్. నిన్ను నువ్వు నిరూపించుకుంటున్నందుకు చాలా గర్వపడుతున్నాను'' అంటూ రణదీప్ పేర్కొన్నాడు. ఎక్కడా కంగనా పేరుని ప్రస్తావించలేదు. అయితే రణదీప్ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే కంగనా సోదరి రంగోలి రణదీప్ హుడాను విమర్శిస్తూ ట్వీట్స్ చేస్తూ వచ్చారు.
''నువ్వు కరణ్ జోహార్‌కు అభిమానివి. అందుకే బంధు ప్రీతిని ప్రోత్సహిస్తూ ఆలియాను పొగుడుతున్నావు. ఆలియాలాంటి వాళ్లు కనీసం చెంచాగిరి చేసైనా విజయం సాధిస్తున్నారు. నువ్వింకా ఫెయిల్యూర్ యాక్టర్‌వే. ఉంగ్లీ సినిమా సమయంలో నువ్వు కంగనాని ఎంత ఇబ్బంది పెట్టావో నాకు తెలుసు'' అంటూ రంగోలి తెలిపారు. మరి దీనిపై ఆలియా భట్ ఎలా స్పందిస్తారో చూడాలి.