సీక్వెల్‌కు సిద్ధమైన కంగనా రనౌత్
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్లో వివాదాలకు కేరాఫ్ ఎవరు? అంటే మనకు ముందుగా గుర్తుకొచ్చే పేరు కంగనా రనౌత్. క్వీన్ తర్వాత డిఫరెంట్ సినిమాలను ఎంచుకుంటూ కంగనా రనౌత్ తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంది. ప్రస్తుతం కంగనా రనౌత్ తేజస్ సినిమాలో నటిస్తుంది. అలాగే జయలలిత బయోపిక్ తలైవి షూటింగ్‌ను పూర్తి చేసేసింది తేజస్ చిత్రీకరణ పూర్తయిన తర్వాత కంగనా రనౌత్ సీక్వెల్‌కు సిద్ధమైందని అంటున్నారు. ఇంతకూ కంగనా రనౌత్ చేయబోతున్న సీక్వెల్ ఏంటో తెలుసా? మణికర్ణికకు సీక్వెల్. ఝాన్సీ లక్ష్మీబాయ్ జీవితగాథను మణికర్ణిక .. ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది కంగనా రనౌత్.
ఇప్పుడు మరో వీరనారి జీవితగాథను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుందని టాక్ వినిపిస్తోంది. కాశ్మీర్ రాణి దిద్దా జీవితగాథను మణికర్ణిక ది లెజెండ్ ఆఫ్ దిద్దా పేరుతో తెరకెక్కించనున్నారట. ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ చిత్రాన్ని నిర్మించిన కమల్ జైనే.., మణికర్ణిక ది లెజెండ్ ఆఫ్ దిద్దాను నిర్మిస్తాడట. మరి సీక్వెల్‌ను కంగనా రనౌత్ డైరెక్ట్ చేస్తారా? లేక మరేవరైనా డైరెక్ట్ చేస్తారా? అని తెలియాల్సి ఉంది. వచ్చే ఏడాదినే సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com