హృతిక్ స్పందనపై కంగనా రియాక్షన్
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్.. హీరోయిన్ కంగనా రనౌత్ వివాదం సద్దుమణిగెలా కనపడటం లేదు. సూపర్ 30, మెంటల్ హై క్యా సినిమాల విషయంలో ఈ వివాదం మరింత పెరిగింది. కంగనా సోదరి రంగోలి చేసిన వ్యాఖ్యలకు హృతిక్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ``మానసికంగా వేధిస్తున్నారు. ఓ వర్గం వారు దీనికి వంత పాడుతున్నారు.
కాబట్టి నా సినిమా నిర్మాతలను మరో మంచి రిలీజ్ డేట్ చూసుకని సినిమాను విడుదల చేసుకోవాలని కోరుతున్నాను`` అంటూ ప్రెస్‌నోట్ విడుదల చేశారు. దీనిపై కంగనా కూడా స్పందించింది. ``హృతిక్ ఇంత విషాదంగా ఎందు స్పందించారో తెలియడం లేదు. కానీ పురుషాధిక్య ప్రపంచంలో ఏక్తాకపూర్కి అభినందనలు. మా సినిమాకు మంచి రిలీజ్ డేట్ దొరికినందుకు ఆనందంగా ఉంది`` అన్నారు కంగనా.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments