హృతిక్ స్పందనపై కంగనా రియాక్షన్
- IndiaGlitz, [Saturday,May 11 2019]
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్.. హీరోయిన్ కంగనా రనౌత్ వివాదం సద్దుమణిగెలా కనపడటం లేదు. సూపర్ 30, మెంటల్ హై క్యా సినిమాల విషయంలో ఈ వివాదం మరింత పెరిగింది. కంగనా సోదరి రంగోలి చేసిన వ్యాఖ్యలకు హృతిక్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ''మానసికంగా వేధిస్తున్నారు. ఓ వర్గం వారు దీనికి వంత పాడుతున్నారు.
కాబట్టి నా సినిమా నిర్మాతలను మరో మంచి రిలీజ్ డేట్ చూసుకని సినిమాను విడుదల చేసుకోవాలని కోరుతున్నాను'' అంటూ ప్రెస్‌నోట్ విడుదల చేశారు. దీనిపై కంగనా కూడా స్పందించింది. ''హృతిక్ ఇంత విషాదంగా ఎందు స్పందించారో తెలియడం లేదు. కానీ పురుషాధిక్య ప్రపంచంలో ఏక్తాకపూర్కి అభినందనలు. మా సినిమాకు మంచి రిలీజ్ డేట్ దొరికినందుకు ఆనందంగా ఉంది'' అన్నారు కంగనా.