సమంతను ఫెమినిస్ట్ అంటున్న కంగనా సోదరి
- IndiaGlitz, [Friday,July 05 2019]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత 'ఓ బేబీ' చిత్రంతో మరో బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఉమెన్ ఓరియెంటెడ్‌గా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా కోసం ఎక్కువ మంది మహిళలే పనిచేయడం ఆసక్తికరమైన విషయం. ఈ సినిమా విడుదల తర్వాత ఇటు ప్రేక్షకులే కాదు.. అటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటుంది. ఈ సినిమాతో సమంత ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుందని ఓ వెబ్‌సైట్ కథనం రాయగా..
దీనిపై కంగా సోదరి రంగోలి స్పందించారు. ''ఓ బేబీ' అద్భుతమైన విజయాన్ని సాధించింది. సమంత అసలైన ఫెమినిస్ట్ ఎందుకంటే ఆమె జీవితం ఓ సక్సెస్ స్టోరీ. ఓ గొప్ప కుటుంబానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. ఇలాంటి దేవతల్ని మేం మెచ్చుకుంటాం. కంగనా బృందం నుండి మీకు ఆల్ ది బెస్ట్' రంగోలి ట్వీట్ చేశారు. దీనికి సామ్ 'ఎంతో దయతో మాట్లాడినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు' అంటూ సామ్ సమాధానం ఇచ్చారు.