కంగనా సర్‌ప్రైజ్
- IndiaGlitz, [Saturday,July 06 2019]
బాలీవుడ్ హీరోయిన్ ఇప్పుడు తన దృష్టంతా ఉమెన్ ఓరియెంటెడ్ చిత్రాలపైనే పెట్టింది. 'మణికర్ణిక'తో బ్లాక్‌బస్టర్ హిట్‌ను కంగనా తన ఖాతాలో వేసుకున్నారు. ఈ నెల 26న 'జడ్జ్‌మెంటల్ హై క్యా' చిత్రంతో సందడి చేయబోతున్నారు. అయితే ఈరోజు కంగనా అందరికీ షాక్ ఇచ్చారు. 'ధాకడ్' ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది కంగనా.
ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. పూర్తి స్థాయి యాక్షన్ సినిమాను పోలి ఉండేలా ఈ ప్రచార లుక్‌ను విడుదల చేశారు. లుక్‌తోపాటు ''నా కెరీర్ నా ప్రయాణమే కాదు.. ఇండియన్ సినిమా జర్నీ కూడా. 'ధాకడ్' ప్రయత్నం ఫలిస్తే.. సినిమాల్లో నటిస్తున్న మహిళలు ఇక వెనక్కితిరిగి చూడరు' అంటూ మెసేజ్ కూడా పోస్ట్ చేసింది కంగనా. ఈ చిత్రానికి రజనీశ్ రాయ్ దర్శకుడు. వచ్చే ఏడాదిలోనే షూటింగ్ ప్రారంభం కానుందట.