'మణికర్ణిక' షూటింగ్ పూర్తి
Send us your feedback to audioarticles@vaarta.com
కంగనా రనౌగ్ టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రం `మణికర్ణిక`. జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది. ప్రథమ స్వాంతంత్ర్య సమరంలో బ్రిటీష్ వారిని ఎదిరించిన ఝాన్సీ లక్ష్మీబాయ్ జీవిత చరిత్రే ఈ సినిమా. భారీ బడ్జెట్, టెక్నికల్ వేల్యూస్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నిన్నటితో ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది.
నిజానికి క్రిష్ కమిట్మెంట్స్ కారణంగా డైరెక్షన్ చేయకపోవడంతో... కంగనాయే ఈ సినిమాను డైరెక్ట్ చేసింది. టాలీవుడ్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే అందించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమాను 2019 జనవరి 25న విడుదల చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments