మ‌రోసారి గాయ‌ప‌డింది...

  • IndiaGlitz, [Wednesday,November 22 2017]

కంగనా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం 'మ‌ణిక‌ర్ణిక‌'. టాలీవుడ్ డైరెక్ట‌ర్ క్రిష్ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఇప్ప‌టికే కంగనా రనౌత్ ముక్కుకి గాయ‌మైన సంగ‌తి తెలిసిందే. కాగా రీసెంట్‌గా కంగనా మ‌రోసారి కూడా చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో గాయ‌ప‌డింది.

ఆమె కాలికి బలైమెన గాయం తగిలింది. వెంటనే యూనిట్ స‌భ్యులు ఆమెను దగ్గర్లోని హాస్పిటల్‌కి ఆమెను తరలించారు కొద్ది రోజులు ఆమెకు విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు దర్శకనిర్మాతలు. దీంతో షూటింగ్ ఆగిపోయింది.

వెంటనే ముంబాయి వెళ్ళిపోయింది కంగనా. ఇదే చిత్రానికి సంబంధించి ఓ యాక్షన్ సీక్వెన్స్ చేస్తూ గాయుపడి కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. అప్పుడు కూడా కొన్ని రోజులు షూటింగ్‌కి బ్రేక్ పడింది. మరి ఈ సినిమా పూర్తయ్యే సరికి ఇంకెన్ని సార్లు గాయాలపాలవుతుందో, షూటింగ్‌కి ఇంకా ఎన్ని బ్రేకులు ప‌డ‌తాయో చూడాలి మ‌రి.