పదేళ్ల కల నెరవేరింది.. కంగనా స్టూడియో రెడీ!
Send us your feedback to audioarticles@vaarta.com
కంగనా రనౌత్.. పట్టుదలకు మారుపేరుగా.. బాలీవుడ్ క్వీన్‌గా తనకంటూ ప్రత్యేక సొంతం చేసుకున్న నటి. విభిన్న పాత్రలతో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. పట్టు పట్టిందంటే.. నెగ్గేవరకు వదలదన్నది ఆమెకున్న పేరు. తాజాగా సొంత స్టూడియో నిర్మించుకుని తనేంటో మరోసారి ప్రపంచానికి చాటింది ఈ ముద్దుగుమ్మ. స్టూడియో నిర్మాణం.. ఆమె పదేళ్ల కల. ఇప్పటికి ఆ కలనెరవేరింది. ముంబైలోని పాలి హిల్ ప్రాంతంలో నిర్మించిన ఈ స్టూడియోకు.. మణికర్ణిక ఫిల్మ్స్ అనే పేరు పెట్టారు. ఈ విషయాలను ఆమె సోదరి రంగోలి తన ట్విట్టర్ ద్వారా తెలిపింది. స్టూడియో ప్రారంభం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి కంగన పూజలు నిర్వహించారు. స్టూడియో వ్యవహారాలను న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో ఫిల్మ్ ప్రొడక్షన్లో శిక్షణ పొందిన ఆమె సోదరుడు అక్షత్ పర్యవేక్షించనున్నాడు.
మణికర్ణిక ఫిల్మ్స్ పేరు వెనక..
మణికర్ణిక ఆమె నటించిన సినిమా. ద క్వీన్ ఆఫ్ ఝాన్సీగా ప్రేక్షకులను అలరించిన ఈ సినిమాకు దర్శకురాలిగా కూడా ఆమె బాధ్యతలు నిర్వహించింది. డైరెక్టర్‌గా తొలి సినిమా కూడా. అఖండ విజయాన్ని సొంతం చేసుకుని నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టింది. ఆ విజయానికి గుర్తుగానే ఆ పేరు పెట్టిందనే మాటలు సినీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఇప్పటి నుంచి కంగనా దర్శక, నిర్మాతగా తన ప్రయాణాన్ని మరింత చురుకుగా చేయనుందంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com