సెక్స్‌పై కంగ‌నా సంచలన వ్యాఖ్య‌లు

  • IndiaGlitz, [Monday,September 30 2019]

వివాదాల‌తోనో, వివాద‌స్పద వ్యాఖ్య‌ల‌తోనో నిత్యం వార్త‌ల్లో నిలుస్తున్న హీరోయిన్స్‌లో కంగ‌నా రనౌత్ ముందు వ‌రుస‌లో ఉంది. ఈ అమ్మ‌డు రీసెంట్‌గా ఓ ప్రోగ్రామ్‌లో పాల్గొని సెక్స్‌పై చేసిన వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. ఈ సంద‌ర్భంలో ఈమె త‌న సెక్స్ జీవితం గురించి కూడా బ‌హిరంగా చెప్ప‌డం టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా నిలిచింది.

''సెక్స్ చేయాల‌నే ఆలోచ‌న వ‌చ్చిన‌ప్పుడు ఏమాత్రం ఆలోచించ‌కుండా సెక్స్ చేయండి. ఎందుకంటే జీవితంలో సెక్స్ అనేది చాలా ముఖ్య‌మైన అంశం. త‌ల్లిదండ్రులు కూడా త‌మ పిల్ల‌లు సెక్స్ చేసుకుంటే హ్యాపీగా ఫీల్ కావాలి. పిల్ల‌లు కూడా సెక్స్ విష‌యంలో బాధ్య‌తాయుతంగా మెల‌గాలి. నేను సెక్స్ విష‌యంలో యాక్టివ్‌గా ఉన్నాన‌ని తెలుసుకుని నా త‌ల్లిదండ్రులు షాకయ్యారు'' అన్నారు.

ద‌శాబ్దాలుగా సెక్స్‌పై చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని, ఇలా చ‌ర్చ‌లు చేయ‌డం కంటే నేరుగా సెక్స్‌లో పాల్గొన‌డ‌మే మేల‌ని ఆమె అన్నారు. బాధ్య‌త‌తో వ్య‌వ‌హ‌రిస్తే ఎవ‌రైనా సెక్స్‌ను ఎంజాయ్ చేయ‌వ‌చ్చు. ఒక‌ప్ప‌టిలా పెళ్లి వ‌ర‌కు సెక్స్ ఫీలింగ్స్‌ను దాచుకోవ‌డం మంచి కాద‌న్న కంగనా ఒక‌ప్ప‌టిలా త‌ల్లిదండ్రులు కూడా కండోమ్ యాడ్ వ‌చ్చిన‌ప్పుడు ఛానెల్ మార్చ‌డానికి తొంద‌ర‌ప‌డటం లేద‌ని తెలిపింది కంగ‌నా.

ఇదే ప్రెస్‌మీట్‌లో నిద్ర‌లేచిన త‌ర్వాత మీరు హృతిక్‌లా మారిపోతే ఏం చేస్తారు? అని అడ‌గ్గా.. వెంటనే నా మొబైల్ తీసుకుని కంగనాకు ఫోన్ చేసి సారీ చెబుతాను తెలివిగా స‌మాధానం ఇచ్చింది క్వీన్ కంగ‌నా