బైడెన్ ఏడాదికి మించి బతకరంటూ కంగన సంచలన వ్యాఖ్యలు

  • IndiaGlitz, [Monday,November 09 2020]

అగ్రరాజ్యం అమెరికాకు కాబోయే అధ్యక్షుడు, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌పై బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జో బైడెన్ ఒక గజిని అని.. ఆయన ఏడాదికి మించి బతకరని ఆమె వ్యాఖ్యానించారు. ఆ తరువాత మొత్తం బాధ్యతలు చూసుకునేది కమలా హ్యారిసేనని కంగన పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా కంగన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.

ప్రతి ఐదు నిమిషాలకు డేటా క్రాష్ అయిపోయే గజినీ జో బైడెన్.. ఆయనకు ఎక్కించిన మందులతో ఏడాదికి మించి బతుకుతారని అనుకోవడం లేదు. ఆ తరువాత కమలా హారిసే షో రన్ చేస్తారు. ఒక మహిళ ఎదిగితే.. మరింత మంది మహిళలు ఎదిగేందుకు అవకాశం కలుగుతుంది. ఈ హిస్టారిక్ డేకి చీర్స్’’ అంటూ కంగనా రనౌత్ ట్వీట్ చేసింది. కాగా.. జో బైడెన్ అధ్యక్షుడు కావడంతో ఇక కమలా హారిస్ కూడా వైస్ ప్రెసిడెంట్ కానున్నారు. కమలా హ్యారిస్ అమెరికాకు 49వ ఉపాధక్షురాలిగా ఎన్నిక కానున్నారు.

More News

కంటెస్టెంట్లను ఒక ఆట ఆడుకున్న సుమ.. ఎలిమినేట్ అయిన అమ్మ

‘నా పేరు చిన్నా’ సాంగ్‌తో హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. కంటెస్టెంట్లందరికీ దీపావళి గిఫ్ట్స్ తీసుకొచ్చానని అయితే అవి దక్కించుకోవడం కోసం ఒక్కొక్కరు ఒక్కో టాస్క్ చేయాలని చెప్పారు.

మెగాస్టార్‌కు కరోనా.. రెండు రోజుల క్రితమే సీఎంను కలిసిన చిరు

మెగాస్టార్ చిరంజీవి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని చిరు ట్విట్టర్ ద్వారా స్వయంగా వెల్లడించారు. నిజానికి నేటి నుంచి `ఆచార్య` సినిమా షూటింగ్‌ను ప్రారంభించబోతున్నట్టు చిత్రబృందం వెల్లడించింది.

బాబాయ్‌, అబ్బాయ్ మ‌ల్టీస్టారర్‌

సినీ ఇండ‌స్ట్రీలో కొన్ని క్రేజీ కాంబినేష‌న్స్ కోసం అభిమానులు, ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాయి. అలాంటి వాటిలో సీనియ‌ర్ స్టార్ హీరో విక్ట‌రీ వెంక‌టేశ్‌, రానా ద‌గ్గుబాటి కాంబినేష‌న్‌.

రజినీకాంత్ బయోపిక్...

ర‌జినీకాంత్‌.. బ‌స్సు కండ‌క్ట‌ర్ ప్రారంభ‌మైన ఆయ‌న జీవితం సినిమాల్లోకి ప్ర‌వేశించిన త‌ర్వాత సూప‌ర్‌స్టార్ రేంజ్‌కు చేరుకున్నారు. ఎంద‌రికో స్ఫూర్తిదాయ‌కంగా ఉండే ఆయ‌న జీవితాన్ని తెర‌పై

ఎన్‌.శంక‌ర్ స్టూడియో భూముల వ్య‌వ‌హ‌రం.. ప్ర‌భుత్వ వివ‌ర‌ణ‌

ద‌ర్శ‌కుడు ఎన్‌.శంక‌ర్ స్టూడియో నిర్మాణానికి నామ‌మాత్ర‌పు ధ‌ర‌ల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం భూమి కేటాయించ‌డంపై కోర్టులో ప్ర‌జాహిత వ్యాజ్యం వేశాడు కరీంన‌గ‌ర్‌కు చెందిన జె.శంక‌ర్. తెలంగాణ‌కు చెందిన