గాంధీ, నెహ్రులను విమర్శించిన కంగనా రనౌత్
- IndiaGlitz, [Saturday,October 31 2020]
శనివారం ఐరన్‌మ్యాన్ సర్దార్ వల్లబాయ్ పటేల్ జయంతి. ఈ సందర్భంగా దేశంలోని నాయకులందరూ ముఖ్యంగా బీజేపీ నాయకులు ఆయనకు నివాళులు అర్పించారు. సినీ రంగం వైపు నుండి చూస్తే ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నివాళులు అర్పించింది. తనదైన పంథాలో ఓవైపు సర్దార్ వల్లబాయ్ పటేల్‌ను పొడుగుతూనే గాంధీ, నెహ్రులను విమర్శించింది కంగనా. కేవలం గాంధీ కోసం, ఆయన్ని సంతోషపెట్టడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రధాని పదవిని వదులుకున్నారు. కానీ ఆ నిర్ణయం వల్ల ఆయనేం బాధపడలేదు. కాఈ దేశం కొన్ని దశాబ్దాల పాటు బాధపడింది.
మనకు దక్కాల్సిన దాన్ని ఏ పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు. వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషి, అయినా నెహ్రువంటి బలహీనవైన మనస్తత్వం ఉన్న వ్యక్తిని గాంధీ ప్రధాని చేయాలనుకున్నారు. అయితే గాంధీ మరణించిన తర్వాత పరిస్థితి ఘోరంగా తయారయ్యింది. భారత ఉక్కు మనిషి వల్లభాయ్ పటేల్‌కు జయంతి శుభాకాంక్షలు. మీరు అఖండ భారతదేశాన్ని అందించారు. ప్రధాని పదవిని వదులుకోవడం వల్ల మీ నాయకత్వాన్ని మాకు మీరు దూరం చేశారు. మీ నిర్ణయంపై మేం చింతిస్తున్నాం అంటూ ట్విట్ట్రర్ వేదికగా కంగనా తన భావాలను వెల్లడించింది. మరి కంగనా వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు ఎలా స్పందిస్తాయో చూడాలి.