నేనైతే ఆ పని చేయను.. దీపికపై కంగనా ఫైర్.!
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు దీపికా పదుకొనే, కంగనా రనౌత్ సినిమాలకే కాదు.. సామాజిక అంశాల్లోనూ చురుకుగా ఉంటారన్న విషయం తెలిసిందే. ఇటీవల జేఎన్‌యూ విద్యార్థులను పరామర్శించడానికి వెళ్లిన దీపిక.. ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారారు. విద్యార్థులపై దాడిని ఖండించి.. వారికి సంఘీభావం తెలిపారు. దీనిపై ప్రశంసలు ఎంతగా వచ్చాయో.. విమర్శలు అంతేస్థాయిలో వచ్చాయి.
ఇదిలా ఉంటే.. తాజాగా దీపిక పరామర్శపై కంగనా రనౌత్ స్పందించింది. దీపికకు ఆ స్వేచ్ఛ ఉందని.. అయితే తాను మాత్రం తుక్డే గ్యాంగ్‌కు సపోర్ట్ చేయనని పలికింది. ఏదైనా చేయగల స్వేచ్ఛ దీపికకు ఉంటుందంటూనే.. ఆమె చర్యను ఖండించింది. జవాన్లు మరణిస్తే పండుగ చేసుకునే వారి వెనక అస్సలు ఉండనని.. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునే శక్తులకు అస్సలు మద్దతు పలకనని చెప్పింది. తన సినిమా ‘పంగా’ ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసింది. పంగా ఈ నెల 24న విడుదలకానుంది. ఇటీవల పంగా రిలీజ్ సందర్భంగా దీపిక పదుకొనె, కంగనా రనౌత్ ఒకరినొకరు కలుసుకున్నారు. దీపిక ఆ సమయంలో పంగా సినిమాలో నటనకు కంగనాను ప్రత్యేకంగా అభినందించింది కూడా.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com