హిట్ ఇచ్చిన డైరెక్టర్‌పై కంగనా ఆరోపణ
- IndiaGlitz, [Monday,October 08 2018]
బాలీవుడ్లో 'తను వెడ్స్ మను, క్వీన్' చిత్రాలు కంగనాకు స్టార్ హీరోయిన్గా బ్రేక్ ఇచ్చాయి. ప్రస్తుతం ఈమె 'మణికర్ణిక' సినిమా చేస్తుంది. అయితే ప్రస్తుతం బాలీవుడ్లో ప్రకంపనలు పుట్టిస్తున్న కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు ఎక్కువ అవుతున్నాయి. తాజాగా కంగనా రనౌత్ మరో ఆరోపణ చేసింది. అది కూడా తనకు క్వీన్ వంటి సూపర్‌హిట్ ఇచ్చిన డైరెక్టర్ వికాస్ బాల్‌పైనే కావడం గమనార్హం. 'అప్పటికే పెళ్లైన వికాల్ బాల్ ప్రతిరోజు సెక్స్ కోసం అమ్మాయిని వెతుక్కునేవాడు.
ఆ విషయాలను నేను పట్టించుకోలేదు. ప్రతిరోజూ వికాస్ పార్టీ చేసుకునేవాడు.. నేను కూడా అతనితో ఉండి త్వరగా నిద్రపోయేదాన్ని.. దీనిపై ఎన్నోసార్లు వికాస్ నన్ను విమర్శించాడు. మొహం మీద అనరాని మాటలు అనేవాడు. అయితే నేనంటే అతనికి భయమే. ఎప్పుడూ నన్ను ఫేవర్ చేయమని అడగలేదు. నలుగురిలో కలిసినప్పుడు పలకరిస్తే నన్ను కౌగిలించుకుని మెడపై వాలిపోయి, వాసన చూసేవాడు'' అంటూ కంగనా ఆరోపణలు చేసింది.
కాస్టింగ్ కౌచ్ వివాదం కారణంగా వికాస్ నిర్మాణ భాగస్వామ్య సంస్థ ఫాంటమ్ మూత పడింది. ఈ విషయాన్ని అనురాగ్ కశ్యప్ చెప్పారు. తనుశ్రీపై లీగల్‌గా చర్యలు తీసుకోవడానికి నానా పటేకర్ సిద్ధమవుతుండగా.. వికాల్ బాలి ఇప్పుడేమంటాడో చూడాలి.