కంగన లోదుస్తుల ఇష్యూ
- IndiaGlitz, [Saturday,March 30 2019]
కంగన లో దుస్తులు వేసుకుంటే నాకెందుకు? వేసుకోకపోతే నాకెందుకు? ఆమె లోదుస్తులు వేసుకోవడం, వేసుకోకపోవడం ఆమె ఇష్టం. ఇలాంటి విషయాల్లో నన్ను లాగితే ఊరుకునేది లేదు అని బాలీవుడ్ మేకర్ పహ్లజ్ నిహ్లానీ అన్నారు. ఇటీవల 'ఐ లవ్యూ బాస్' సినిమా గురించి కంగనా మాట్లాడుతూ సాఫ్ట్ పోర్న్ టైప్ పాత్ర చేయమని నాకు పహ్లజ్ ఆఫర్ చేశారు.
నేను లోదుస్తులు లేకుండా ఫొటోషూట్ చేసిన మాట వాస్తవమే కానీ, ఆ తర్వాత ఎందుకో ఫోన్ నెంబర్ మార్చేశాను అని ఇటీవల కంగన అన్నారు. దీని గురించి పహ్లజ్ మాట్లాడుతూ నేను ఈ సినిమా చేయాలనుకున్న మాట వాస్తవమే. ఫొటో షూట్ కోసం రూ.80లక్షలు ఖర్చుపెట్టా. ఆ ఫొటో షూట్ తర్వాతే కంగనకు అసలైన అవకాశాలు వచ్చాయి.
ఫొటో షూట్ కోసం రెఫరెన్స్ ఫొటోలు పంపించానేకానీ,ఆ రోజు నేనసలు వెళ్లలేదు. అప్పట్లో ఆ ఫొటోలు మీడియాలో చాలా బాగా ప్రచారం అయ్యాయి. అయినా ఆమె లోదుస్తులు వేసుకుంటే నాకెందుకు? వేసుకోకపోతే నాకెందుకు? నేనెప్పుడూ ఆమెను ఫోర్స్ చేయలేదు. ఫొటో షూట్ చేయడం, చేయకపోవడం ఆమె ఇష్టం. ఇప్పుడు ఇలా మాట్లాడటం సరికాదు అని అన్నారు. కంగన ఏమంటుందో చూడాలి మరి.