వెయిటేజ్ కోసం వెయిట్ పెరుగుతున్న హీరోయిన్
Send us your feedback to audioarticles@vaarta.com
బయోపిక్‌లను చూసే ప్రేక్షకుడు పాత్రలకు కనెక్ట్ కావాలంటే ఆ పాత్రలు రియాలిటీకి దగ్గరగా ఉండాలి. అందు కోసం ఆయా పాత్రల్లో ఒదిగిపోవడానికి నటీనటులు ప్రయత్నించాలి. వెండితెరపై పాత్రలను చూస్తుంటే నిజ జీవితంలోని పాత్రలు గుర్తుకు రావాలి. అలాంటప్పుడే సినిమాలు విజయవంతమవుతాయి. ప్రస్తుతం తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌ను ముగ్గురు దర్శకులు తెరకెక్కిస్తున్నారు. ఇది కాకుండా ఓ వెబ్ సిరీస్ కూడా రూపొందుతోంది. వీటిలో ఎ.ఎల్.విజయ్ రూపొందిస్తోన్న బయోపిక్ `తలైవి`.
విష్ణు ఇందూరి నిర్మిస్తోన్న ఈ సినిమాలో టైటిల్ పాత్రలో కంగనా రనౌత్ నటిస్తున్నారు. కంగనా పాత్ర కోసం చాలా కష్టపడుతున్నారు. ఇప్పటికే ప్రత్యేకంగా తమిళం కూడా నేర్చుకుంటున్నారు. అలాగే భరతనాట్యం కూడా నేర్చుకుంటున్నారనే వార్తలను విన్నాం. అయితే వీటితో పాటు సబ్జెక్ట్‌ను అనుసరించి పాత్ర కోసం కంగనా 10 కిలోల బరువు కూడా పెరుగుతున్నారని టాక్.
ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ చిత్రానికి `బాహుబలి` ఫేమ్ విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు రచయితగా పనిచేస్తున్నారు. జి.వి.ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సి నిమాతో పాటుమరో జయలలిత బయోపిక్ `ది ఐరన్ లేడీ` పేరుతో రూపొందుతోంది. ఇందులో నిత్యామీనన్ జయలలితగా కనిపించనున్నారు. జయలలిత వెబ్‌సిరీస్‌లో జయలలితగా రమ్యకృష్ణ నటిస్తున్నారు. మరి పురట్చితలైవిగా ఎవరు ఆదరణ పొందుతారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout