వార్నర్ అవుట్.. విలియమ్సన్ ఇన్..
Send us your feedback to audioarticles@vaarta.com
ఇప్పటి వరకూ ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఒక్కటంటే ఒక్కటే మ్యాచ్ గెలుచుకుని పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలవడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ కఠిన నిర్ణయం దిశగా అడుగులు వేసింది. తమ జట్లు దారుణమైన ప్రదర్శనకు జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్‌ను బాధ్యుడిని చేస్తూ ఆయనపై వేటు వేసింది. ఆయన స్థానంలో కేన్ విలియమ్సన్‌ను రైజర్స్ నూతన సారధిగా ఎంపిక చేస్తూ యాజమాన్యం తమ నిర్ణయాన్ని ప్రకటించింది. ఆదివారం రాజస్థాన్‌తో జరిగే మ్యాచ్ నుంచే ఈ మార్పులు అమలవుతాయని మేనేజ్‌మెంట్ స్పష్టం చేసింది.
బాడీ బిల్డర్ జగదీష్ లాడ్ కరోనాతో మృతి
అంతేకాకుండా తమ జట్టు విదేశీ ఆటగాళ్ల కూర్పులోనూ మార్పులుంటాయని తెలిపింది. కాగా.. డేవిడ్ వార్నర్‌కు తుది జట్టులోనూ చోటు సందేహంగానే మారింది. దీంతో ఆయన కెరీర్‌కు కూడా ఇబ్బందుల్లో పడిందనే చెప్పాలి. వార్నర్ వరుసగా 3, 54, 36, 37, 6, 57 పరుగులు చేసినా పెద్దగా ప్రతిభనైతే చాట లేకపోయాడు. మరోవైపు కేన్ నాయకత్వం వహించిన 2018 సీజన్‌లో జట్టును ఫైనల్‌కు చేర్చి తన నాయకత్వ పటిమను రుజువు చేసుకున్నాడు. కేన్ విలియమ్సన్ కెప్టెన్సీలో ఎన్నో విజయాలను అందించాడు. ఆయన కెప్టెన్సీలో రైజర్స్ 26 మ్యాచ్‌లాడితే 14 విజయాలు, 12 ఓటములున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments