వార్నర్ అవుట్.. విలియమ్సన్ ఇన్..

ఇప్పటి వరకూ ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఒక్కటంటే ఒక్కటే మ్యాచ్ గెలుచుకుని పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలవడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ కఠిన నిర్ణయం దిశగా అడుగులు వేసింది. తమ జట్లు దారుణమైన ప్రదర్శనకు జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్‌ను బాధ్యుడిని చేస్తూ ఆయనపై వేటు వేసింది. ఆయన స్థానంలో కేన్ విలియమ్సన్‌ను రైజర్స్ నూతన సారధిగా ఎంపిక చేస్తూ యాజమాన్యం తమ నిర్ణయాన్ని ప్రకటించింది. ఆదివారం రాజస్థాన్‌తో జరిగే మ్యాచ్‌ నుంచే ఈ మార్పులు అమలవుతాయని మేనేజ్‌మెంట్‌ స్పష్టం చేసింది.

బాడీ బిల్డర్ జగదీష్ లాడ్ కరోనాతో మృతి

అంతేకాకుండా తమ జట్టు విదేశీ ఆటగాళ్ల కూర్పులోనూ మార్పులుంటాయని తెలిపింది. కాగా.. డేవిడ్ వార్నర్‌కు తుది జట్టులోనూ చోటు సందేహంగానే మారింది. దీంతో ఆయన కెరీర్‌కు కూడా ఇబ్బందుల్లో పడిందనే చెప్పాలి. వార్నర్ వరుసగా 3, 54, 36, 37, 6, 57 పరుగులు చేసినా పెద్దగా ప్రతిభనైతే చాట లేకపోయాడు. మరోవైపు కేన్ నాయకత్వం వహించిన 2018 సీజన్‌లో జట్టును ఫైనల్‌కు చేర్చి తన నాయకత్వ పటిమను రుజువు చేసుకున్నాడు. కేన్ విలియమ్సన్‌ కెప్టెన్సీలో ఎన్నో విజయాలను అందించాడు. ఆయన కెప్టెన్సీలో రైజర్స్‌ 26 మ్యాచ్‌లాడితే 14 విజయాలు, 12 ఓటములున్నాయి.

More News

బాడీ బిల్డర్ జగదీష్ లాడ్ కరోనాతో మృతి

బాడీ బిల్డర్ల గురించి మాట్లాడగానే మనకు గుర్తొచ్చే పేరు జగదీష్ లాడ్. బాడీ బిల్డింగ్‌లో ఎన్నో టైటిల్స్ గెలుచుకుని మిస్టర్ ఇండియాగా పేరు తెచ్చుకున్న జగదీష్ లాడ్

ఇండియా నుంచి వస్తే ఐదేళ్ల జైలు: ఆస్ట్రేలియా ప్రభుత్వం

ఆస్ట్రేలియా ప్రభుత్వం తమ దేశ పౌరులపై కఠిన నిబంధన విధించింది.

సీఎం కేసీఆర్‌కు మంత్రి ఈటల శాఖ బదిలీ

రాష్ట్ర వైద్య , ఆరోగ్యశాఖను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు బదిలీ చేస్తూ గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

సూప‌ర్‌స్టార్ మ‌హేష్, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో భారీ చిత్రం

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు, మాట‌ల మాంత్రికుడు స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన `అత‌డు` 16ఏళ్లుగా, `ఖ‌లేజా` 11ఏళ్లుగా ప్రేక్ష‌కుల్ని, అభిమానుల్ని అల‌రిస్తూనే ఉన్నాయి.

సిద్దార్థ్‌ను పట్టించుకోకండి.. టైమ్‌ పాస్ కోసం ఆరోపణలు చేస్తారు: బీజేపీ

కేంద్ర ప్రభుత్వంపై హీరో సిద్ధార్థ్‌ చేసే ఆరోపణలు, విమర్శలను ఎవ్వరూ పట్టించుకోవద్దని బీజేపీ నేతలు తమ కార్యకర్తలకు వెల్లడించారు.