వరుణ్ తేజ్ - క్రిష్ 'కంచె' ట్రైలర్ కి తేది ఫిక్సయింది...
Send us your feedback to audioarticles@vaarta.com
కంచె అనేది ఊళ్ళ మధ్యన, దేశాల మధ్యనే కాదు. మనుషుల మధ్యన, కుటుంబాల మధ్యన కుడా ఉండొచ్చు, ఉంటాయి. ఈ నేపధ్యం లో, 1940 ల లో సాగే ఒక కథ ను దర్శకుడు క్రిష్ ఎంతో ప్రతిష్టాత్మకం గా తెరకెక్కించిన చిత్రమే 'కంచె'.
మెగా కుటుంబం నుండి వచ్చిన లేటెస్ట్ క్రేజీ హీరో వరుణ్ తేజ్, ప్రఖ్యాత సూపర్ మోడల్ ప్రగ్య జైస్వాల్ జంటగా నటిస్తోన్న ఈ చిత్రం ఇటివలే షూటింగ్ ను దిగ్విజయం పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. 'కంచె' చిత్రాన్ని రాజీవ్ రెడ్డి, మరియు సాయి బాబు జాగర్లమూడి సంయుక్తం గా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కానుకగా ఈ సినిమా ట్రైలర్ ను సెప్టెంబర్ 1న విడుదల చేసి ఆడియో విడుదలను సెప్టెంబర్ 12న విడుదల చేయడానికి ప్లాన్స్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments