'కంచె' ట్రైలర్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం కంచె. గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుమ్ వంటి విలక్షణ చిత్రాల దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. వై.రాజీవ్ రెడ్డి, జె.సాయిబాబు నిర్మాతలు. ఈ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం సెప్టెంబర్ 1, మంగళవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ఐ మ్యాక్స్ జరిగింది. దర్శక ధీరుడు రాజమౌళి, మెగాబ్రదర్ నాగబాబు, హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ ప్రగ్యాజైశ్వాల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ట్రైలర్ రిలీజ్ అనంతరం ఏర్పాటైన సమావేశంలో....
కంచె` గ్యారంటీగా పెద్ద కమర్షియల్ హిట్ మూవీగా నిలుస్తుంది – ఎస్.ఎస్.రాజమౌళి
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి మాట్లాడుతూ ''క్రిష్ ను ఎక్కువగా పొగేస్తుంటాను. అందుకే ఆయన ఫంక్షన్ కి రావాలంటే చిన్న భయం కూడా ఉంటుంది. ఒక సినిమాని బాగా తీయాలంటే ప్యాషన్, డేడికేషన్, రైట్ యాట్యిట్యూడ్ ఉండాలి. ఇవన్నీ ఎక్కువగా ఉన్న దర్శకుడు క్రిష్. తను కంచె సినిమా డైరెక్ట్ చేయడం ఫెంటాస్టిక్. సినిమా అంటేనే ఆడియెన్స్ ను వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లే సాధనం. అటువంటి అడ్వాంటేజ్ పీరియడ్ సినిమాల్లో కాస్తా ఎక్కువగా ఉంటుంది. కానీ అలా తీసుకెళ్లడం చాలా కష్టం. ట్రైలర్ చూస్తుంటే కాస్ట్యూమ్స్, డ్రస్, బాటిల్ ట్యాంక్ తయారు చేయాలన్న ఎంత కష్టమో నాకు తెలుసు. అందుకు చాలా డేడికేషన్ ఉండాలి. టీమ్ పడ్డ కష్టం తెలుస్తుంది. ట్రైలర్‌లోని ఫస్ట్ షాట్ ట్యాంకర్ షాట్ చూడగానే నాకు ఒళ్ళు జల్లుమనిపించింది. ఒక ఫెంటాస్టిక్ ప్రొడక్ట్ వస్తుందని నాకు అర్థమైంది. క్రిష్ సినిమాలకు మంచి క్రిటికల్ అక్లెయిమ్ వస్తుంది. కానీ తనకి నిజమైన కమర్షియల్ సక్సెస్ రాలేదు. ఆ కంచెను ఈ కంచె దాటుతుంది, పెద్ద కమర్షియల్ సక్సెస్ అవుతుందనే ఫీలింగ్ ట్రైలర్ చూడగానే వచ్చింది. ఇక వరుణ్ గురించి చెప్పాలంటే , వరుణ్ కే కాదు, ఏ పెద్ద ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోస్ ఎంత పెద్ద వరమో అంతే పెద్ద శాపం కూడా అని నా అభిప్రాయం. ఎందుకంటే చాలా రకాలైన పోలికలు, చాలా రకాలైన సలహాలిస్తుంటారు. అలాంటి సలహాలు వరుణ్‌కి చాలా వచ్చుంటాయని అనుకుంటున్నాను. చరణ్‌లా ఫైట్స్ చేయాలి, బన్నిలా డ్యాన్సులు చేయాలి, పవన్ లా స్టయిల్ చూపించాలనే సలహాలిస్తుంటారు. అయితే వరుణ్ ఎవరినీ ఫాలో కాకుండా మెగా ఫ్యామిలీ నుండి రావడం ఆశీర్వాదంగా తీసుకుని తనకంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకోవాలని నా సలహా. ఇప్పుడు వరుణ్ కూడా అదే చేస్తున్నాడని తన ఎంచుకుంటున్న సినిమాలు, యాక్టింగ్ స్టయిల్ చూస్తుంటే డిఫరెంట్ గా ఉంది. క్రిష్, వరుణ్ అండ్ టీమ్‌కి కంగ్రాట్స్. ట్రైలర్ చూస్తుంటే గ్యారంటీ హిట్ అని తెలుస్తుంది'` అన్నారు.
గమ్యం` తర్వాత నేను చేసిన గొప్ప కథ కంచె`- క్రిష్ జాగర్లమూడి
డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి మాట్లాడుతూ `ఒక కథను చెప్పాలంటే బలంగా చెప్పాలనుకునే వ్యక్తిని నేను. ఓ కథను రాసుకోవాలంటే కొంత టైమ్, తీయడానికి మరికొంత టైమ్ పడుతుంది. అలాగే కథను నేను దాదాపు మూడు సంవత్సరాలుగా క్యారీ చేశాను. ప్రపచంలో జరిగిన గొప్పయుద్ధాల్లో గొప్పది రెండో ప్రపంచ యుద్ధం కానీ 75 సంవత్సరాలుగా ఇటువంటి కథతో తెలుగు, తమిళంలో సినిమాలు రాలేదు. ఈ కథ రాసుకున్నప్పుడు ఎవరూ ఈ విధంగా పెర్‌ఫార్మన్స్ చేస్తారోనని అనుకునేవాడిని. ఎందుకంటే హీరో సోల్జర్‌గా ఉండాలి. అమాయకత్వంతో, తెలియని తెంపరితనంతో కూడుకుని ఉండాలి. 1936లో చెన్నపట్నంలో చదువుకున్న విద్యార్థిలా ఉండాలి. కానీ దేవుడి దయ, ప్రకృతి అంతా కలిసి నాకు ఇవ్వడమో ఏమో కానీ కథకు కావాల్సినవన్నీ ఆటోమెటిక్ గా సమకూరాయి. బడ్జెట్, హీరో, హీరోయిన్ ఇంకేదైనా కావచ్చు. ఈ సినిమాని నిడిని రెండు గంటల ఐదు నిమిషాల సినిమా. గమ్యం తర్వాత గొప్ప కథ నాకు దొరికింది. దాన్ని బాగా ఎగ్జిక్యూట్ చేశామని అనుకుంటున్నాం. చాలా సంవత్సరాలు తర్వాత థియేటర్స్ కి బాహుబలి వల్ల ఆడియెన్స్ బండ్లు కట్టుకుని వస్తున్నారు. ఆ తర్వాత శ్రీమంతుడు కూడా పెద్ద హిట్టయింది. అదే కోవలో మా కంచె సినిమా కూడా చేరాలి. ద్వేషాలతో ఈరోజు సెప్టెంబర్ 1న వరల్డ్ వార్ స్టార్టయింది. సెప్టెంబర్ 2న 1945న వరల్డ్‌వార్ ముగిసింది. ప్రపంచ యుద్ధం ముగిసి 70 ఏళ్లవుతుంది. దేశాల మధ్య కంచె వేసుకుంటున్నారు. అలాగే మనుషులకు, మనసులకు మధ్య కూడా కంచె వేసుకుంటున్నారనే మాక్రో, మైక్రో పాయింట్‌పై సినిమాని తీశాను.బ్యూటిఫుల్ లవ్‌స్టోరి. ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది. సెప్టెంబర్ 12న ఆడియో, అక్టోబర్ 2న సినిమా రిలీజ్ ఉంటుంది''అన్నారు.
కంచె` ఎక్స్ ట్రార్డినరీగా ఉంటుంది – హీరో వరుణ్ తేజ్
వరుణ్ తేజ్ మాట్లాడుతూ ''క్రిష్ గారు కథ చెప్పగానే నాకు బాగా నచ్చింది. అయితే లోపల ఇదొక పీరియడ్ ఫిలిం, 1940 బ్యాక్‌డ్రాప్ ఎలా వస్తుందోనని చిన్న భయం ఉండేది. కానీ రీరికార్డింగ్ సమయంలో సినిమా చూశాను. ఎక్‌ట్రార్డినరీగా వచ్చింది. మా రెండు గంటల సినిమా ఎలా ఉంటుందో చెప్పే చిన్న ఎగ్జాంపిలే ఈ ట్రైలర్. క్రిష్ నుండి ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరూ చాలా కష్టపడ్డారు. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్'' అన్నారు
కంచె` సినిమాలో నటించడం వరుణ్ తేజ్ అదృష్టం – మెగా బ్రదర్ నాగబాబు
నాగేంద్రబాబు మాట్లాడుతూ ''ఈ కథను నాకు చెప్పినప్పుడు అందులోని డెప్త్ నాకు అర్తమయ్యింది. నాపై చాలా ఇంపాక్ట్ చూపిన సినిమా. బ్యూటీఫుల్ లవ్‌స్టోరి. కథ వినగానే నాకు అద్భుతమైన ఫీలింగ్ కలిగింది. ఈ సినిమా చేయడం వరుణ్ అదృష్టం`` అన్నారు.
కంచె సినిమాలో నటించడం అదృష్టం - ప్రగ్యాజైశ్వాల్
ప్రగ్యాజైశ్వాల్ మాట్లాడుతూ ` ఈ సినిమాలోసీతాదేవి క్యారెక్టర్ చేశాను. చాలా ధైర్యవంతురాలు, సంప్రదాయాలకు గౌరవమిచ్చే యువతి పాత్ర. ఇటువంటి సినిమాలో పార్ట్ కావడం ఆనందంగా ఉంది, అదృష్టమని కూడా చెప్పాలి. క్రిష్ గారితో వర్క్ చేయడం అమేజింగ్ ఎక్స్ పీరియెన్స్. వరుణ్ అమేజింగ్ కో యాక్టర్. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్`` అన్నారు.
నికితన్ ధీర్, అవసరాల శ్రీనివాస్, గొల్లపూడి, షావుకారు జానకి, సింగీతం శ్రీనివాస్, పోసాని కృష్ణమురళి, సత్యం రాజేష్, అనూప్ పూరి, మెరీనా టారా ఇతర తారాగణంగా నటిస్తోన్నఈ చిత్రానికి కొరియోగ్రఫీ: బృంద, స్టంట్స్: వెంకట్, డేవిడ్ కుబువా, ఎడిటర్స్: సూరజ్ జగ్ తాప్, రామకృష్ణ అర్రమ్, ఆర్ట్: సాహి సురేష్, డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా, సాహిత్యం: సీతారామశాస్త్రి, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: జ్ఞానశేఖర్, మ్యూజిక్: చిరంతన్ భట్ , నిర్మాతలు: వై.రాజీవ్ రెడ్డి, జె.సాయిబాబు, దర్శకత్వం: క్రిష్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments