కంచె ట్రైలర్ రివ్యూ

  • IndiaGlitz, [Tuesday,September 01 2015]

తెలుగు సినిమా ద‌ర్శ‌కుల ప‌నితీరు చూస్తుంటే హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం త‌గ్గేట్టు క‌నిపించ‌డం లేదు. ఈ ఏడాది ఇప్ప‌టికే బాహుబ‌లి ఆ విష‌యాన్ని రుజువు చేసింది. వ‌రుస‌లో రుద్ర‌మ‌దేవి ఉంది. అక్టోబ‌ర్ 2న కంచె విడుద‌ల కానుంది. కంచె ట్రైల‌ర్‌ను చూసిన ప్ర‌తి ఒక్క‌రూ సినిమా స్టాండ‌ర్డ్స్ గురించి గొప్ప‌గానే ఊహించుకుంటున్నారు.

వార్ సీక్వెన్స్, క‌ల‌ర్‌ఫుల్ ల‌వ్ సీన్స్ చూసేవారిని మెస్మ‌రైజ్ చేస్తున్నాయి. మంగ‌ళ‌వారం విడుద‌లైన ట్రైల‌ర్‌లో డైలాగుల్లోని లోతు అంద‌రినీ చెవి ఒగ్గి వినేలా చేస్తోంది. 'మిస్ట‌ర్ నేనంటే ఇష్ట‌మా? అని ప్ర‌గ్యా అడగ్గా కాదండీ ప్రేమ అంటాడు వ‌రుణ్‌. మ‌రో స‌న్నివేశంలో ఇప్ప‌టివ‌ర‌కు నా చేతిలో ఎంత మంది చ‌చ్చినా చంపిన‌ట్టు లేదురా నిన్నొక్క‌డినీ చంప‌లేక‌పోయాన‌న్న వెలితి అంటాడు విల‌న్‌.

అందుకు హీరో స్పందిస్తూ నేను చ‌స్తే నా శవం ఊరికి నువ్వు తీసుకెళ్లు, నువ్వు చస్తే నేను మోసుకెళ్తా. మ‌నిద్ద‌రిలో ఎవ‌డి శ‌వం ఎవ‌డు తీసుకెళ్లినా ఊరు బాగుప‌డుద్ది అంటాడు. ఇది కూడా మ‌నూరి క‌థే. అక్క‌డ జ‌రిగింది మ‌ళ్ళా ఇక్క‌డ జ‌ర‌క్కూడ‌దు అనేది ట్రైల‌ర్‌లో వ‌చ్చే ఆఖ‌రి మాట‌. ప్ర‌తి షాటూ ఆస‌క్తికంగా సాగుతుంది. క‌నురెప్ప వేస్తే ఎక్క‌డ ఏం మిస్స‌వుతామో అన్నంత‌గా ట్రైల‌ర్‌ను క‌ట్ చేసిన విధానం బావుంది.