కంచె మూవీ రివ్యూ
- IndiaGlitz, [Thursday,October 22 2015]
మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ తొలి చిత్రం ముకుంద' తర్వాత సెకండ్ మూవీని రెగ్యులర్ కమర్షియల్ ఫార్మేట్ లో కాకుండా డిఫరెంట్ మూవీని చేయడానికి అడుగు వేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అది కూడా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో సినిమా, రెండో ప్రపంచయుద్ధ నేపథ్యమున్న సినిమా అని వినగానే సినిమాలో క్రిష్ ఏం చెప్పాలనుకున్నాడో, సినిమా ఎలా ఉంటుందో, ఇప్పటి వరకు దక్షిణాదిన ఎవరూ చేయని ప్రయత్నం చేస్తున్నందుకు తెలుగు చిత్రసీమ క్రిష్, వరుణ్ ను అభినందించారు. ట్రైలర్ చూడగానే అందరికీ నచ్చడంతో ప్రేక్షకులు సినిమా రాక కోసం ఆతృతుగా ఎదురుచూశారు. మరి ప్రేక్షకలు ఆతృతను కంచె ఏ మేర పూర్త చేసిందో తెలుసుకోవాలంటే సమీక్షలోకి వెళదాం...
కథ
ధూపాటి హరిబాబు(వరుణ్ తేజ్) జార్జియాలో బ్రిటిష్ ప్రభుత్వం తరపును పోరాడే భారత సైన్యంలో కెప్టెన్ గా ఉంటాడు. రెండో ప్రపంచ యుద్ధంలో భాగంగా జర్మనీకి వ్యతిరేకంగా పోరాడేదళంలో ఉండే ధూపాటి హరిబాబుతన గతాన్ని గుర్తుకు చేసుకోవడంతో సినిమా ప్రారంభం అవుతుంది. దేవరకొండ గ్రామానికి చెందిన హరిబాబు, చెన్నపట్నంలో చదువుతుంటాడు. అక్కడ రాచకొండ రాజకుటుంబానికి చెందిన సీతాదేవి(ప్రగ్యా జైశ్వాల్)తో పరిచయం అవుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. కానీ హరిబాబు తక్కువ కులానికి చెందినవాడు కావడంతో పెళ్ళికి ఒప్పుకోరని సీతాదేవి అంటుంది. ఆమె కుటుంబాన్ని ఒప్పిస్తానని హరిబాబు నమ్మకంగా ఉంటాడు. సీతాదేవి, అన్న ఈశ్వర్(నికితన్ ధీర్)సైన్యంలోనే పనిచేస్తుంటాడు. ఈశ్వర్ కు హరిబాబు, సీతాదేవిల ప్రేమ ఇష్టం ఉండదు. గ్రామంలో కులాల మధ్య గొడవలు రేపుతారు. ఆ గొడవల్లో హరిబాబు చంపాలనుకుంటారు. మరి హరిబాబు ఏం చేస్తాడు? సీతాదేవి పెళ్ళి చేసుకుంటాడా? అసలు హరిబాబు సైన్యంలో ఎందుకు చేరుతాడు? చివరకు గ్రామాల మధ్య కులాల చిచ్చు ఎంత వరకు వెళుతుంది. ఈశ్వర్, హరిబాబు ఒక్కటవుతారా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
ప్లస్ పాయింట్స్
సినిమాలో వరుణ్ తేజ్ ప్లస్ అయ్యాడు. తన హైట్ కు తగ్గ పాత్ర చేశాడు. లవర్ బోయ్ గా, వార్ కెప్టెన్ గా తన పాత్రలకు న్యాయం చేశాడు. అలాగే తన ప్రేమ కోసం పెద్దలను ఎదిరించిన యువకుడిగా కూడా తన స్టయిల్ లో చేసుకుంటూ వెళ్ళాడు. ఇక ప్రగ్యా జైశ్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాచకొండ సీతాదేవి పాత్రలో హుందాగా కనపడింది. తన పాత్రకు తగిన విధంగా ఆమె ధరించిన కాస్టూమ్స్ చాలా చక్కగా ఉన్నాయి. ప్రగ్యా హండ్రెడ్ పర్సెంట్ సీతాదేవిగా ఒదిగిపోయినటించింది. నికితన్ ధీర్ గ్రామంలో రాచకుంటుంబానికి చెందిన యువకుడుగా, సీతాదేవి అన్నయ్యగా, సైన్యంలో సోల్జర్ గా చక్కగా నటించాడు. రెండో ప్రపరంచ యుద్ధ నేపథ్యంలో హరిబాబు స్నేహితుడుగా నటించిన అవసరాల శ్రీనివాస్ కామెడి పండించే ప్రయత్నం చేశాడు. కొంతమేర ఆకామెడి సక్సెస్ అయింది. కొండయ్య పాత్రలో గొల్లపూడి మారుతీరావు నటన బాగుంది. చిరంతన్ భట్ సంగీతం చాలా బావుంది. అటు ఇటు చిటెకలు ఎవ్వరికో.. అనే సాంగ్, ఊరంతా .. అనే సాంగ్ సహా హీరో హీరోయిన్ మధ్య వచ్చే డ్యూయెట్ వినడానికే కాదు పిక్చరైజేషన్ బావుంది. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్ ప్రతి ఫ్రేమ్ రిచ్ గా, ఫ్రెష్ గా కనపడింది. మేకింగ్ చూస్తే హాలీవుడ్ తరహాలో కనపడింది. నిర్మాణ విలువలు బావున్నాయి.
మైనస్ పాయింట్స్
రెండో ప్రపంచయుద్ధ నేపథ్యంలో ఒక లవ్ స్టోరీని ముడిపెట్టి చేయాలనే క్రిష్ ఆలోచనే చాలా గొప్పది. అయితే ఈ రెండింటికి ముడిపెట్టే సమయంలో స్టోరి గ్రిప్పింగ్ మిస్సయిన భావన కలిగింది. ఒక సీన్ లవ్ స్టోరీ, మరో సీన్ వార్ సీన్ మిక్సింగ్ ఉండటం కాస్తా కన్ ఫ్యూజన్ గా ఉంది. సినిమా స్లో నెరేషన్ లో ఉండటం వల్ల ప్రేక్షకుడు సినిమా ఎప్పుడైపోతుందా అని ఆలోచిస్తాడు. లవ్ స్టోరీ ఎమోషనల్ గా అనిపించదు. చివర్లో సగటు టాలీవుడ్ ప్రేక్షకుడు కోరుకునే హ్యపీ ఎండింగ్ కనపడదు.
విశ్లేషణ
రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యానికి లవ్ స్టోరీని చేయాలనే దర్శకుడి ఆలోచన చాలా బావుంది. ఇలాంటి కథ ఎంచుకోవడంతో క్రిష్ డేర్ నెస్ అర్థం చేసుకోవచ్చు. దక్షిణాది సినిమాలో ఇలాంటి ప్రయత్నం చేసినందుకు అభినందించాలి. ప్రేమలోనే యుద్ధం ఉంటుంది. ప్రేమ కావాలంటే యుద్ధం చేయాల్సిందే..నేను జాన్ పాల్ అని రవి ప్రకాష్ అంటే జాన్ , పాల్ కలిపితే జనపాలుడు అంటే కృష్ణుడే కదా అని హీరో చెప్పే డైలాగ్, నేను ఛస్తే నా శవాన్ని నువ్వు తీసుకెళ్ళు, నువ్వు ఛస్తే నీ శవాన్ని నేను మోసుకెళతాననే వరుణ్, నికితన్ మధ్య వచ్చే డైలాగ్స్ తో సాయిమాధవ్ బుర్రా తన పెన్ పవర్ చూపించాడు. రెండో పప్రంచయుద్ధం జర్మన్స్, యూదులకు మధ్య జరిగింది అంటే అక్కడ మతాలు.. మన గ్రామాల్లో కులాల మధ్య గొడవలు అవుతుంటాయి. దేశాలు మధ్యనే కాదు, గ్రామాల మధ్య, మనషుల మనసుల్లో కంచెలు వేసుకుని జీవిస్తున్నాం అనే చిన్న కాన్సెప్ట్ క్రిష్ చెప్పాలనుకున్న తీరు ఆకట్టుకుంటుంది. జర్మన్ సైన్యం వరుణ్ తేజ్ అండ్ టీమ్ ను ఎటాక్ చేసినప్పుడు ఓ జర్మన్ యువతి బాత్ రూమ్ లో వరుణ్ అండ్ టీమ్ ను దాచిపెట్టి కాపాడుతుంది. అలాగే చిన్న పిల్లను, కొంతమంది పౌరులు, నికితన్ ధీర్ ప్రాణాలు కాపాడటానికి హీరో చేసిన పోరాటాలు ఆకట్టుకుంటాయి. చిరంతన్ భట్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు అదనపు బలాలయ్యాయి. ఇలాంటి కాన్సెప్ట్ కావడంతో సినిమా ఒక మల్టీప్లెక్స్ ఆడియెన్స్ కు కనెక్ట్ అవుతుంది తప్పే బి, సి జోనర్ ప్రేక్షకులకు కనెక్ట్ కాదు.
బాటమ్ లైన్: రెగ్యులర్ కమర్షియల్ ఫార్మేట్ కు భిన్నంగా చేసిన కంచె...ఓ డిఫరెంట్ అటెంప్ట్
రేటింగ్: 3.25/5