సక్సెస్ టూర్లో 'కంచె' టీమ్
Send us your feedback to audioarticles@vaarta.com
వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ తెరకెక్కించిన చిత్రం కంచె. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన ప్రాగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటించగా, నికేతన్ ధీర్ విలన్ గా నటించాడు.రెండవ ప్రపంచ యుద్ధం నేపథ్యంతో తెరకెక్కిన కంచె సినిమా సక్సెస్ టాక్ తో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ సక్సెస్ సంతోషాన్ని ప్రేక్షకులతో పంచుకునేందుకు కంచె టీమ్ సక్సెస్ టూర్ ప్లాన్ చేసింది. ఈరోజు నుంచి కంచె సక్సెస్ టూర్ ప్రారంభమైంది. ఈ రోజు విజయనగరంలో ప్రారంభించి వైజాగ్ లో పర్యటించనున్నారు. రేపు కాకినాడ, రాజమండ్రి, తణుకు ప్రాంతాల్లో ఈ సక్సెస్ టూర్ నిర్వహించనున్నారు. 28న ఏలూరు, విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో ఈ సక్సెస్ టూర్ నిర్వహించనున్నారు. కంచె సినిమాకు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్ సీస్ లో కూడా మంచి కలెక్షన్స్ వస్తుండడం విశేషం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com