'కంచె' ఓవర్ సీస్ హక్కులను...
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం కంచె. గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుమ్ వంటి విలక్షణ చిత్రాల దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. వై.రాజీవ్ రెడ్డి, జె.సాయిబాబు నిర్మాతలు.
రెండవ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ కి ఆడియెన్స్, ఇండస్ట్రీ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ వన్ మిలియన్ వ్యూవర్స్ క్లిక్ పొంది కొత్త రికార్డుని క్రియేట్ చేసింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఓవర్ సీస్ హక్కులను అబ్ సోల్యుట్ తెలుగు సినిమాస్ సంస్థ సొంతం చేసుకుంది. ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments