'కంచె' వాయిదా పడింది
Send us your feedback to audioarticles@vaarta.com
కంచె విడుదల వాయిదా పడింది. అక్టోబర్ 2కు బదులు ఈ సినిమాను నవంబర్ 6న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను రాజీవ్‌రెడ్డి, సాయిబాబు నిర్మిస్తున్నారు. ఇటీవలే పాటలు కూడా విడుదలయ్యాయి.
రెండో ప్రపంచయుద్ధ నేపథ్యంలో సాగిన సినిమా ఇది. ముందు అక్టోబర్ 2న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఈ నెల 24 నుంచి వరుసగా మెగా హీరోల చిత్రాలు విడుదలకున్నాయి. తమ సినిమాలే తమకు పోటీగా ఉండటం ఇష్టం లేకే ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. దీపావళిని పురస్కరించుకుని నవంబర్ 6న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని యూనిట్ నిర్ణయించిందట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com