17న హైదరాబాద్ లో 'కంచె' ఆడియో
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా కుటుంబం నుండి వచ్చిన లేటెస్ట్ క్రేజీ హీరో వరుణ్ తేజ్. ఈ మెగాబ్రదర్ తనయుడు తొలి చిత్రం ముకుంద`తో సక్సెస్ సాధించాడు. ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా, ప్రఖ్యాత సూపర్ మోడల్ ప్రగ్య జైస్వాల్ జంటగా నటిస్తోన్న చిత్రం 'కంచె '. గమ్యం`, వేదం`, కృష్ణం వందే జగద్గురుమ్` వంటి విలక్షణ చిత్రాలతో టాలీవుడ్ లోనే కాకుండా రీసెంట్ గా బాలీవుడ్ లో కూడా గబ్బర్` చిత్రం తో మంచి విజయాన్ని సాధించిన దర్శకుడు క్రిష్ జాగర్లమూడి. ఈయన దర్శకత్వంలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై రాజీవ్ రెడ్డి, సాయిబాబు నిర్మాతలుగా ఈ కంచె` చిత్రం ప్రతిష్టాత్మంగా రూపొందుతోంది.
ఈ వినాయకచవితి సందర్భంగా కంచె` ఆడియో విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్ లో సెప్టెంబర్ 17 వ తేదీన నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. అలాగే సినీ పరిశ్రమకి చెందిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు.
అక్టోబర్ 2వ తేదీన ప్రపంచ వ్యాప్తం గా కంచె` చిత్రం విదుదల అవుతుంది. వరుణ్ తేజ్ కెరీర్ లో ఈ చిత్రం ఒక మైలురాయి గా నిలుస్తుంది. కంచె అనేది ఊళ్ళ మధ్యన, దేశాల మధ్యనే కాదు. మనుషుల మధ్యన, కుటుంబాల మధ్యన కూడా ఉండొచ్చునని దర్శకుడు క్రిష్ తెలిజేశారు. 1940 నేపథ్యంలో సాగే ఈ కథ ను మానవీయ విలువలతో దర్శకుడు క్రిష్ పూర్తి కమర్షియల్ హంగులతో, తన మార్కు విలువలను జోడిస్తూ తెరకెక్కించారు .
కంచె` చిత్రం లోని అన్ని పాటలు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు అధ్భుతంగా రచించారని నిర్మాతలు రాజీవ్ రెడ్ది మరియు జాగర్లమూడి సాయిబాబు తెలిపారు.ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ చిరంతాన్ భట్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. ఆదిత్యా మ్యూజిక్ ద్వారా ఈ చిత్రం ఆడియో విడుదల అవుతుంది.
భారీవ్యవయం తో, అత్యుత్తమ సాంకేతిక విలువల తో రూపుదిద్దుకుంటున్నఈ కంచె, తెలుగుసినిమా ప్రతిష్ట ను పెంచే చిత్రం అవుతుంది అనటం లో ఎటువంటి సందేహం లేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com