హిందీ 'కాంచన' టైటిల్


Send us your feedback to audioarticles@vaarta.com


నటుడు, కొరియోగ్రాఫర్, నిర్మాత, దర్శకుడు.. ఇలా తనకంటూ ఓ ఇమేజ్‌ను సంపాదించుకున్నారు రాఘవ లారెన్స్. హారర్ కామెడీలో పంథాలో `ముని` సిరీస్ ట్రెండ్‌ను క్రియేట్ చేస్తున్నాయి. ఈ సిరీస్ కారణంగా రాఘవ లారెన్స్ హారర్ కామెడీ చిత్రాలకు బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. తెలుగు, తమిళంలో ఈ సిరీస్‌లో నాలుగో భాగం ..`కాంచన 3`(ముని 4) ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తనకు దర్శకుడిగా చాలా గొప్ప పేరు తెచ్చిన ఈ సిరీస్‌తో రాఘవ లారెన్స్ బాలీవుడ్‌లో దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు.
2011ఏడాదిన తెలుగు, తమిళంలో `కాంచన` విడుదలైన సంగతి తెలిసిందే. దీని హిందీ రీమేక్‌లో బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ హీరోగా నటించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ హిందీ రీమేక్‌కు `లక్ష్మి` అనే టైటిల్‌ను నిర్ణయించారని సమాచారం. `కాంచన`లో రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తే.. కథకు కీలకమైన హిజ్రా పాత్రలో శరత్‌కుమార్ నటించి మెప్పించారు. మరిప్పుడు బాలీవుడ్‌లో రెండు పాత్రల్లో అక్షయ్ కుమారే నటిస్తాడా.. లేక శరత్‌కుమార్ పాత్రకు మరేవరినైనా తీసుకుంటారో తెలియాంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
