రేపే కనకదుర్గ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం..

  • IndiaGlitz, [Friday,October 16 2020]

విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్ శుక్రవారం ఉదయం 11:30 గంటలకు ప్రారంభం కానుంది. ఇప్పటికే పలు మార్లు డేట్స్ ఫిక్స్ చేసుకుని పలు కారణాల వల్ల వాయిదా పడిన ఈ కార్యక్రమం ఎట్టకేలకు రేపు ప్రారంభం కానుంది. ఏపీ సీఎం జగన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వర్చువల్‌గా పాల్గొని ఫ్లై ఓవర్‌ను ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఏయండీ ఇంతియాజ్ పరిశీలించారు.

కాగా.. ఫ్లై ఓవర్ ప్రారంభమైన అనంతరం మొదటగా ఆర్ అండ్ బీ మంత్రి శంకర్ నారాయణ, పలువురు అధికారులు ప్రయాణించనున్నారు. అంతే కాకుండా శుక్రవారం కనకదుర్గ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 61 కొత్త ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కాగా.. ఈ 61 ప్రాజెక్టు పనులు

15,592 కోట్ల రూపాయల అంచనాతో అధికారులు ప్రారంభించనున్నారు.

More News

‘వేదాళం’ సినిమాకు ముహూర్తం కుదిరింది..!

మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య‌’ సినిమా పూర్తి కానేలేదు . కానీ.. త‌దుప‌రి రెండు సినిమాల‌ను ఆయ‌న లైన్‌లో పెట్టారు.

ఇంటికి చేరుకున్న తమన్నా...

తమన్నా ఇంటికి చేరుకోవడమేంటి? అనే సందేహం కలుగక మానదు. లాక్‌డౌన్‌ సమయంలో ఇంటికే పరిమితమైన ఈ మిల్కీబ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో

సాయితేజ్ బర్త్‌డే సందర్భంగా చిరు ఆసక్తికర ట్వీట్..

సుప్రీం హీరో సాయితేజ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు, అభిమానులు పెద్ద సంఖ్యలో విషెస్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు.

అవినాష్ మాస్క్‌ని తొలగిస్తున్నాడా?

నిన్నటి అమితుమీ టాస్క్ ఇవాళ కూడా కంటిన్యూ అయ్యింది. బిగ్‌బాస్ డీల్ ఇస్తారు.

మంత్రి వెల్లంపల్లికి మళ్లీ అస్వస్థత.. ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు..

దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మరోసారి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన కోలుకున్నట్టే కోలుకుని తిరిగి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.