'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' చిత్రం రిలీజ్ ఖరారు
Send us your feedback to audioarticles@vaarta.com
రాంగోపాల్ వర్మ ఆధ్వర్యంలో తెరకెక్కించిన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రం ట్రైలర్, సాంగ్స్ ఎంతటి సంచలనం సృష్టించాయో తెలిసిందే. తెలుగు రాష్టాల్లో ఈ సినిమాపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో చూపించబోతున్న కంటెంట్ ఎలా వుండబోతుందా అనే ఆసక్తి నెలకొంది. ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రం నిర్మిస్తున్నారు. సిద్దార్థ తాతోలు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రం ట్రైలర్ ను ఇటీవల విడుదల చేయగా...విశేషమైన ఆదరణ లభించింది. పప్పు లాంటి అబ్బాయి పాట వైరల్ గా నిలిచింది. సూపర్బ్ రెస్పాన్స్ తో మంచి ట్రెండింగ్ లో హల్చల్ చేసింది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో సాగే ఈ చిత్రంలో అనేక ఎలిమెంట్స్ ని డైరెక్టర్ టచ్ చేశాడు. ప్రతీ పాత్రకు ప్రాధాన్యమండేలా తీర్చిదిద్దారు. కమర్షియల్ సాగే ఎంటర్టైనర్ చిత్రమిది. భారీ అంచనాల మధ్య ఈ చిత్రాన్ని త్వరలోనే అత్యధిక థియేటర్లలో విడుదల చేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com