‘కమ్మరాజ్యంలో..’ ట్రైలర్-2: సేమ్ టూ సేమ్ దింపేశాడుగా!
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ.. ఏం చేసినా సంచలనమే. సినిమా తీసినా.. ట్విట్టరెక్కి ట్వీట్ చేసినా అది సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతుంది. ఇలాఎందుకంటే.. ఆయన వివాదాలంటేనే ఇష్టం.. అలానే పెరిగారు కూడా. నిత్యం వివాదాలతో రోజు ప్రారంభించి మళ్లీ పడుకునేటప్పుడు ఏదో ఒక్కటి చేస్తే కానీ కునుకు పట్టదు. అదీ ఆర్జీవీ రోజూవారి దినచర్య. అయితే ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ఆర్జీవీ ప్రకటించారు. ఇప్పటికే చిత్రంలో ఎవరెవరు నటిస్తున్నారు..? ఎవరెవరికి ఏయే పాత్రలు అనే విషయం దాదాపు క్లారిటీ ఇచ్చేశారు. అంతేకాదు.. కొద్దిరోజుల క్రితం ‘ఏయ్.. ఏసెయ్ రా నా కొడుకుని.. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’.. ‘కేఏ పాల్’ కు సంబంధించిన పాటలను ట్విట్టర్ వేదికగా ఆర్జీవీ విడుదల చేసిన సంచలనం సృష్టించారు. ఆ తర్వాత ‘పప్పులాంటి అబ్బాయ్..’ అనే పాటతో మరోసారి హడావుడి చేశాడు.
ట్రైలర్లో ఏముంది.. ఎలా ఉంది..!?
అయితే తాజాగా.. ఈ సినిమాకు సంబంధించిన రెండో ట్రైలర్‌ను ఆర్జీవీ విడుదల చేశాడు. 2:37 నిమిషాలు నిడివి గల ఈ వీడియోలో సినిమా ఏ రేంజ్లో ఉంటుందో చూపించేశాడు ఆర్జీవీ.‘హఠాత్తుగా జరిగిన ఎవ్వరూ ఊహించని రాజకీయ పరిణామాలతో పిచ్చెక్కిపోయి, తమ మనుగడకే ముప్పొచ్చిందన్న నిస్పృహలో పడిపోయారు ఓడిపోయిన పార్టీకి సంబంధించిన తండ్రీ కొడుకులు’ అంటూ ట్రైలర్ ప్రారంభమైంది. ‘ఇలాంటి వాతావరణంలో ఇంకో ఐదేళ్లు కష్టమే. అప్పటికి మీకు 75 సంవత్సరాలు వస్తాయి...ఈలోగా మన పార్టీని ఆ పొట్టోడు లాగేసుకోకపోతే...’ అనే డైలాగ్ అదుర్స్. ‘కొడుకు మీద ప్రేమతో పార్టీని మొత్తం నాశనం చేశారు’ అని అదే పార్టీకి చెందిన ఓ వ్యక్తి చెప్పే డైలాగ్ ట్రైలర్‌కే హైలెట్‌గా నిలిచింది.
దింపేశాడుగా..!
అంతేకాదు.. అసెంబ్లీలో వైఎస్ జగన్ పాత్రధారి, చంద్రబాబు పాత్రధారిని హెచ్చరించడం, కొన్ని క్రైమ్ సీన్స్ ఈ ట్రైలర్లో ఉన్నాయి. కాగా.. గత అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం జగన్.. టీడీపీ అధినేత చంద్రబాబు, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని హెచ్చరిస్తూ కూర్చోవయ్యా.. కూర్చో అంటూ వ్యాఖ్యానించిన విషయం విదితమే. ఆర్జీవీ తాజా ట్రైలర్లో యాజ్ ఇట్ ఈజ్ దింపేశాడు. ఇదొక్కటే కాదు టీడీపీకి సంబంధించిన కొన్ని డైలాగ్స్ యథావిథిగా ఉన్నాయి. ముఖ్యంగా ట్రైలర్ మొత్తమ్మీద లోకేష్, పవన్ కల్యాణ్ పాత్రధారులు చెప్పే డైలాగ్స్ హైలైట్‌గా నిలిచాయి. ఇవన్నీ అటుంచితే పవన్‌ను అరెస్ట్ చేస్తానన్న కత్తి మహేశ్ డైలాగ్ ట్రైలర్‌కు ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు.
ఈ డైలాగ్స్ అదుర్స్ బాబోయ్..!
‘సినిమాల్లో నటించి.. మీకు సేవ చేయడంలో ఉన్న విలువైన కాలాన్ని వృథా చేయనని మీకు హామీ ఇస్తున్నాను’ అని పవన్ కల్యాణ్ పాత్రధారి డైలాగ్ కూడా ట్రైలర్-2లో ఉంది. మరోవైపు లోకేష్ పాత్రధారి.. ఓ బహిరంగ సభలో.. ‘వాళ్ల నాన్న గంగవీటి గంగా గారిని మర్డర్ చేయించింది మనమేనని తెలిసి కూడా మన పార్టీలో చేరారు’ అనే డైలాగూ ఉంది. అయితే ఉదయం రిలీజ్ చేసిన ఈ ట్రైలర్‌కు నిమిషాల వ్యవధిలో వేల కొద్దీ వ్యూస్ రావడం విశేషమని చెప్పుకోవచ్చు. కాగా.. నవంబర్ ఈ నెల 29న ‘కమ్మరాజ్యంలో..’చిత్రాన్ని ఆర్జీవీ థియేటర్లలోకి తెస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై వివాదాలు చుట్టుముట్టగా రిలీజ్‌కు నోచుకుంటుందో లేదో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com