రాంగోపాల్ వర్మచిత్రం...కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ట్రైలర్ వచ్చేస్తోంది

  • IndiaGlitz, [Saturday,October 26 2019]

తన సినిమాలతోను ...సోషల్ మీడియాలో పోస్టింగులతోనూ సంచలనాలను సృష్టించే రాంగోపాల్ వర్మ పలు బయోపిక్ లు , యదార్ధ సంఘటనల ఇతివృత్తంతో సినిమాలను రూపొందించిన సంగతి తెలిసిందే. శివ చిత్రం మొదలుకొని ఇప్పటివరకు వైవిధ్య భరిత చిత్రాలను తెరకెక్కిస్తూ ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన అగ్ర దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజా సంచలనం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రం.

ఇక టైటిల్ ను బట్టి చూస్తే ఇది రెండు బలమైన సామాజిక వర్గాలకు మధ్య జరిగే ఇతివృత్తం అని అనుకుంటారు. కానీ ఈ చిత్ర కధాంశం అది కాదు. ఫ్యాక్షనిజం, రౌడీయిజమ్, రాజకీయ నేపద్యాలలో సాగే కమర్షియల్ ఎంటర్టైనర్ చిత్రమిదని చిత్ర బృందం తెలిపింది. ఇక ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రం ట్రైలర్ ఆదివారం ఉదయం విడుదల కానుంది.

షూటింగ్ కార్యక్రమాలు పూర్తి కావచ్చిన ఈ చిత్రంలో మొత్తం ఏడు పాటలు ఉంటాయి. మరోవైపు నిర్మాణానంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నవంబర్ నెలలో సినిమాను విడుదల చేస్తాం. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం అని చిత్ర బృందం వెల్లడించింది.

More News

దీపావళి సంబరాలు చేసుకున్న ప్రతిరోజు పండగే టీం

చిత్రలహరి చిత్రంతో మంచి విజయం అందుకొన్న సుప్రీం హీరో సాయి తేజ్ హీరోగా భలే భలే మగాడివోయ్, మహానుభావుడు వంటి బంపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన

బాలయ్య 105వ మూవీ లుక్.. కాపీ పేస్టే!

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టిస్తోన్న 105వ చిత్రం విషయంలో అభిమానులకు చిత్రబృందం తియ్యటి శుభావార్త చెప్పింది. దీపావళి సందర్భంగా

కార్తి 'ఖైదీ' దీపావళిక బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది - కె.కె.రాధామోహన్‌

యాంగ్రీ హీరో కార్తి కథానాయకుడిగా డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు, తిరుప్పూర్‌ వివేక్‌

హుజూర్‌నగర్‌పై కేసీఆర్ వరాల వర్షం... తెలంగాణలో ఏ ఇంచైనా నాదే!

హుజూర్‌నగర్‌ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి కలలో కూడా ఊహించని రీతిలో మెజార్టీ సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఇందుకు కృతజ్ఞతగా సీఎం కేసీఆర్ సభ నిర్వహించారు.

ఆర్టీసీ జేఏసీ నేతల చర్చలు విఫలం.. వాట్ నెక్స్ట్!

తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతలు యాజమాన్యంతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. అన్ని డిమాండ్లు పరిష్కరించాలని కార్మిక నేతలు పట్టుబట్టారు.