‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ మూవీ టైటిల్‌ మార్పు

  • IndiaGlitz, [Thursday,November 28 2019]

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సంచలన చిత్రం ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’. రేపు అనగా.. నవంబర్ 29న రిలీజ్ చేస్తామని చిత్రబృందం చెప్పినప్పటికీ.. విడుదలపై మాత్రం అనేక అనుమానాలు వస్తున్నాయి. అసలు రిలీజ్ అవుతుందా..? కాదా..? అని ఆర్జీవీ అభిమానులు, ఔత్సాహికుల్లో టెన్షన్ మొదలైంది. ఇప్పటికే ఈ సినిమాపై పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే రిలీజ్‌కు ఎలాంటి ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌గానీ.. ఆడియో లాంచ్‌ ఇలాంటివేమీ లేకుండా డైరెక్టుగా ఆర్జీవీనే మీడియా ముందుకొచ్చేశాడు. ఈ సందర్భంగా అసలు సినిమా సంగతేంటి..? ఎవరెవర్ని ఎలా చూపించారు..? సినిమా జోనర్ ఎలా ఉంటుంది..? అనే ఆసక్తికర విషయాలను ఆయన పంచుకున్నాడు. అదే రోజు సాయంత్రం ఓ టీవీ చానెల్‌ డిబేట్‌లో పాల్గొన్న ఆర్జీవీ సినిమా టైటిల్‌పై పునరాలోచన చేస్తున్నట్లు ప్రకటించాడు.

టైటిల్ మారిందిగా..!

ఒక వేళ టైటిల్ మార్చాల్సి వస్తే.. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’కు బదులుగా ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ అని మారుస్తానని స్పష్టం చేశాడు. ఇవాళ కోర్టు తీర్పు ఉన్నందున తీర్పు అనంతరం టైటిల్ మార్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వాస్తవానికి ఆర్జీవీ మాట మీద నిలబడిన దాఖలాల్లేవ్.. అదేంటంటే.. ‘నేను మాట మీద కాళ్ల మీద నిలబడతాను’ అని సెటైర్లేసిన రోజులున్నాయ్. మరి టైటిల్ మార్పు విషయంలో ఆర్జీవీ వెనక్కి తగ్గాడని చెప్పుకోవచ్చు. కాగా.. ఆర్జీవీ సినిమాల్లో సన్నివేశాలు, డైలాగ్స్, పలు అసభ్యకర సీన్‌లు మార్పులు చేర్పులు చేయడం ఇదేమీ కొత్తకాదు. మరి ఇవాళ కోర్టు విచారణలో ఏం తేల్చనుంది..? సినిమా రిలీజ్ అవుతుందా..? లేదా..? అసలు టైటిల్ పక్కాగా మారుస్తారా..? లేకుంటే అంతా ఉత్తిత్తే అంటే ఉన్న టైటిల్‌నే కంటిన్యూ చేస్తారా అనేది ఇవాళ తేలిపోనుంది.

More News

అమరావతిలో టెన్షన్.. టెన్షన్.. బాబు కాన్వాయ్‌పై చెప్పులు!

అమరావతిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముందుగా చెప్పినట్లే నవంబర్-28న టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి పర్యటనకు పయనమయ్యారు.

ఆర్జీవీ మరో సంచలనం..: పవన్‌పై సినిమా!

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సంచలన చిత్రం ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’.

దక్షిణాదిలో రెండో రాజధానిపై తేల్చేసిన కేంద్రం

దేశానికి హైదరాబాద్‌ను రెండో రాజధానిగా చేసే అవకాశం ఉందని గత కొన్ని రోజులు మీడియాలో కథనాలు..

‘మహా’నాట పదవుల పంపకాలు పూర్తి..!

మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా ఎన్నో ట్విస్ట్‌లు.. మరెన్నో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.

'మహా' పాలిటిక్స్ కమల్‌‌కు ముందే తెలుసా!

మహారాష్ట్ర రాజకీయాలు మినిట్ టూ మినిట్ మారిపోతున్నాయ్.. అసలు ఎప్పుడు ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందో..?