‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సాంగ్ వచ్చేసిందోచ్!
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ.. ఏం చేసినా సంచలనమే. సినిమా తీసినా.. ట్విట్టరెక్కి ట్వీట్ చేసినా అది సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతుంది. ఇలాఎందుకంటే.. ఆయన వివాదాలంటేనే ఇష్టం.. అలానే పెరిగారు కూడా. నిత్యం వివాదాలతో రోజు ప్రారంభించి మళ్లీ పడుకునేటప్పుడు ఏదో ఒక్కటి చేస్తే కానీ కునుకు పట్టదు. అదీ ఆర్జీవీ రోజూవారి దినచర్య. అయితే ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ఆర్జీవీ ప్రకటించారు.
ఇప్పటికే చిత్రంలో ఎవరెవరు నటిస్తున్నారు..? ఎవరెవరికి ఏయే పాత్రలు అనే విషయం దాదాపు క్లారిటీ ఇచ్చేశారు. తాజాగా ఈ సినిమాలోని ఓ పాటను ట్విట్టర్ వేదికగా ఆర్జీవీ విడుదల చేశారు. ‘ఏయ్.. ఏసెయ్ రా నా కొడుకుని.. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అంటూ మొదలైన ఈ వీడియోలో వర్మ వ్యాఖ్యానం ఉండటం గమనార్హం. ఈ సందర్భంగా ఆర్జీవీ పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.
పాటలో ఏముంది..!?
‘మనిషి చెంప మీద కడితే తట్టుకోగలడు.. కాళ్ల మధ్య తంతే నిలదొక్కుకో గలడు.. కానీ, అహం మీద కొడితే..చంపేస్తాడు..బాబు చంపేస్తాడు’ అంటూ ఈ పాట కొనసాగింది. ఈ పాట ప్రారంభం మొదలుకుని పూర్తయ్యే వరకు టీడీపీ, వైసీపీ నేతల చిత్రాలే ఉన్నాయి. ఆ పాత్రలను నిజజీవిత పాత్రలతో పోల్చడం యాదృచికం అని, సత్య హరిశ్చంద్రుడిపై ప్రమాణం చేసి ఆర్జీవీ చెప్పడం గమనార్హం.
ఏమిటీ రాష్ట్రం!?
‘మన కళ్ల ముందే జరగుతున్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులను చూస్తుంటే.. నిజమా? కలా?. రాజకీయ నాయకుల ఆత్మహత్యలు.. అత్యంత ప్రజాదరణతో గెలిచిన ఇప్పటి ముఖ్యమంత్రిని ‘టెర్రరిస్టు’తో పోలుస్తున్న అప్పటి ముఖ్యమంత్రి. ఏమిటీ వైపరీత్యం? ఏమిటీ రాష్ట్రం? ఎక్కడికి పోతోంది మన దేశం?... ఈ విపత్కర పరిస్థితులకు కారణం కమ్మ రాజ్యంలోకి కడప రెడ్లు రావడం. ఒక మనిషి అహాన్ని దెబ్బతీస్తే అతను ఎంత ఎక్స్ ట్రీమ్‌కు వెళతాడోనన్న ఆలోచనలో నుంచి వచ్చిందే ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’లోని ఈ పాట. విని ఆనందించకండి’ అని వర్మ వ్యాఖ్యానించారు.
Disclaimer : Kamma Rajyamlo Kadapa Reddlu is completely a fictional story with fictional characters ..Any resemblance of #KRKR characters to real life characters is purely coincidental and I swear this on Satya Harishchandra?? ????https://t.co/KjNeHwPbJO
— Ram Gopal Varma (@RGVzoomin) September 24, 2019
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout