వంగ‌వీటిలో క‌మ్మ - కాపు పాట తొల‌గింపు..!

  • IndiaGlitz, [Friday,December 02 2016]

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన మ‌రో సంచ‌ల‌న చిత్రం వంగ‌వీటి. ఈ చిత్రాన్ని రామ‌దూత క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దాస‌రి కిర‌ణ్ కుమార్ నిర్మిస్తున్నారు. రాంగోపాల్‌వ‌ర్మ తెర‌కెక్కిస్తోన్న వంగ‌వీటి సినిమా వాస్త‌వాల‌కు విరుద్ధంగా ఉందంటూ వంగ‌వీటి రాధ హైకోర్టులో పిటిష‌న్ వేసారు. వంగ‌వీటి రాధా వేసిన పిటిష‌న్‌ను ప‌రిశీలించిన కోర్టు ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ‌, నిర్మాత దాస‌రి కిర‌ణ్‌కుమార్‌ల‌కు నోటీసులు జారీ చేసింది. త‌దుప‌రి విచార‌ణ‌ను డిసెంబ‌ర్ 2కు వాయిదా వేసింది.

అయితే...కోర్టులో పిటిష‌న్ వేసిన నేప‌ధ్యంలో రామ్ గోపాల్ వర్మ‌, దాస‌రి కిర‌ణ్ కుమార్ ఈ చిత్రంలోని క‌మ్మ‌, కాపు పాట‌ను తొలగించాలి అని నిర్ణ‌యించుకున్నారు. ఈ విష‌యాన్నివ‌ర్మ‌, దాస‌రి కిర‌ణ్ కుమార్ తెలియ‌చేస్తూ...స్వ‌చ్ఛందంగానే వంగ‌వీటి సినిమా నుంచి క‌మ్మ కాపు అనే పాట‌ను తొల‌గిస్తున్నాం. వంగ‌వీటి ఆడియో వేడుక‌ను ఈనెల3న కోనేరు ల‌క్ష్మ‌య్య యూనివ‌ర్శిటి గ్రౌండ్స్ విజ‌య‌వాడ‌లో ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నాం అని తెలియ‌చేసారు. ఈ చిత్రానికి రైట‌ర్స్ - చైత‌న్య‌ప్ర‌సాద్, రాధాకృష్ణ‌, లిరిక్స్ - సిరాశ్రీ, చైత‌న్య‌ప్ర‌సాద్, డిఓపి రాహుల్ శ్రీవాస్త‌వ్, కె దిలీప్ వ‌ర్మ‌, సూర్య చౌద‌రి, ఎడిట‌ర్ - సిద్దార్ధ తాతోలు, సంగీతం - ర‌వి శంక‌ర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ - విసు, ప్రొడ్యూస‌ర్ దాస‌రి కిర‌ణ్ కుమార్, డైరెక్ట‌ర్ - రామ్ గోపాల్ వ‌ర్మ‌

More News

వైజాగ్ లో సంద‌డి చేస్తున్న అక్కినేని బ్ర‌ద‌ర్స్..!

అక్కినేని బ్ర‌ద‌ర్స్ నాగ‌చైత‌న్య‌, అఖిల్ వైజాగ్ లో సంద‌డి చేస్తున్నారు. ఇంత‌కీ చైతు, అఖిల్ వైజాగ్ లో ఏం చేస్తున్నారు అంటే...నాగ చైత‌న్య హీరోగా క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రాన్ని అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ లో నాగార్జున నిర్మిస్తున్నారు.

ఎన్టీఆర్ మూవీ గురించి న్యూ న్యూస్..!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ జ‌న‌తా గ్యారేజ్ త‌ర్వాత ఏ సినిమా చేయ‌నున్నాడు అనే విష‌యం పై గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. వ‌క్కంతం వంశీ, పూరి జ‌గ‌న్నాథ్, త్రివిక్ర‌మ్ శ్రీనివాస్, అనిల్ ర‌విపూడి, చందు మొండేటి...ఇలా  చాలా మంది ద‌ర్శ‌కుల పేర్లు తెర పైకి వ‌చ్చిన‌ప్ప‌టికీ...ఎవ‌రికీ గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌లేదు.

జయమ్ము నిశ్చయమ్మురా - కరీంనగర్ టు కాకినాడ సక్సెస్ టూర్

విడుదలకు ముందు సుకుమార్, త్రివిక్రమ్, కొరటాల శివ, అనిల్ రావిపూడి, వక్కంతం వంశీ తదితర ప్రముఖుల ప్రశంసలు దండిగా పొందిన "జయమ్ము నిశ్చయమ్మురా" ప్రేక్షకుల ఆదరాభిమానాలను సైతం పుష్కలంగా పొందుతూ.. అసాధారణ విజయం సాధించే దిశగా పరుగులు తీస్తోంది.

ఓవర్ సీస్ లో క్లాసిక్ ఎంటర్ టైన్మెంట్ ద్వారా ఖైదీ నెం 150 విడుదల

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో మైల్ స్టోన్ గా నిలిచే 150వ చిత్రం ఖైదీ నెం 150. ఈ భారీ యాక్షన్ డ్రామాను డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్ తెరకెక్కిస్తున్నారు.

జర్నీని మించిన విజయాన్ని మెట్రో సాధిస్తుంది -నందు

వరల్డ్ సినిమాని, మంచి కథలు ఉన్న సినిమాల్ని తెలుగు ప్రేక్షకులు చూడాలనుకుంటున్నారు. భాష అర్థం కాకపోయినా పొరుగు సినిమాలు చూడాలని ఆశిస్తున్నారు.