కమల్ సినిమా ఆగిపోలేదు...
Send us your feedback to audioarticles@vaarta.com
యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ 'ఇండియన్ 2' తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు పాతికేళ్ల తర్వాత ఈ కాంబోలో సినిమా రూపొందనుండటం విశేషం. ప్రముఖ తెలుగు నిర్మాత దిల్‌రాజు సినిమాను నిర్మిస్తున్నాడు. రెండు వందల కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా కొన్ని కారణాలతో ఆగిపోయిందని వార్తలు వినిపించాయి.
అయితే ఈ వార్తల్లో నిజం లేదని సమాచారం. ఇండియన్ 2 కోసం కమల్ హాసన్ బరువు తగ్గే పనిలో పడ్డాడట. అందుకోసం అమెరికా నుండి ట్రైనర్ ను రప్పించుకున్నాడట కూడా. తెలుగు, తమిళంలో సినిమా రూపొందనుంది. మరి ఇండియన్ 2 సీక్వెల్‌గా లేదా సిరీస్‌గా రూపొందుతుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments