కమల్ - శృతి కలిసి నటించే సినిమా ప్రారంభం..
Tuesday, April 12, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
కమల్ హాసన్ - శృతి హాసన్ ఈ తండ్రి కూతురు ఇద్దరూ కలసి ఒక సినిమాలో నటించనున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా గురించి ఎనౌన్స్ మెంట్ రాలేదు. ఆఖరికి కమల్ - శృతి కలసి నటించే ఈ క్రేజీ మూవీని ఈనెల 29న ప్రారంభించనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించారు. ఈ చిత్రానికి టి.కె రాజీవ్ కుమార్ దర్శకత్వం వహించనున్నారు. రియల్ లైఫ్ లో తండ్రీ కూతుళ్లు అయిన ఈ ఇద్దరూ రీల్ లైఫ్ లో కూడా తండ్రీ కూతుళ్లుగానే నటిస్తుండడం విశేషం. అమెరికాలో ఎక్కువ భాగం షూటింగ్ జరుపుకునే ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. తండ్రి - కూతురు మధ్య ఉండే అనుబంధం కథాంశంగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments