కమల్, నాగే ఒకేలా..
Send us your feedback to audioarticles@vaarta.com
ఓ వైపు కమల్ హాసన్, మరో వైపు నాగార్జున.. ఈ ఇద్దరూ తమ కొత్త సినిమాలతో.. సినిమా ప్రియులను అలరించేందుకు ఒకేలా ఆలోచించి ముందుకు అడుగేశారు. ఇంతకీ అదేమిటంటే.. ఈ ఇద్దరు సీనియర్ నటులు కూడా ఫ్రెంచ్ మూవీస్‌ని ఆధారంగా చేసుకుని సినిమాలు చేశారు. కమల్ హాసన్ విషయానికి వస్తే అతని కొత్త చిత్రం 'చీకటి రాజ్యం'.. ఫ్రెంచ్ మూవీ 'స్లీప్‌లెస్ నైట్' ఆధారంగా తెరకెక్కింది. ఇది ఈ నెల 20న రిలీజ్ కానుంది.
నాగ్ విషయానికి వస్తే.. అతని కొత్త చిత్రాల్లో ఒకటైన 'ఊపిరి' కూడా ఫ్రెంచ్ మూవీ 'ది ఇన్‌టచబుల్స్' ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ సినిమా వచ్చే ఏడాది ఆరంభంలో రిలీజ్ కానుంది. కమల్, నాగ్ ప్రయత్నాలు ఓకే అనిపించుకుంటే.. మనోళ్లు మరిన్ని ఫ్రెంచ్ మూవీస్‌ని తెలుగు, తమిళ వెర్షన్లతో మన ముందుకు తీసుకువస్తారనడంలో అతిశయోక్తి లేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com