పవన్ తమ్ముడుగా కమల్
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ `కాటమరాయుడు` సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి డాలీ దర్శకుడు. ఫ్యాక్షన్ లీడర్ ప్రేమకథగా సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో పవన్ సరసన శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుంది. తమిళంలో అజిత్ నటించిన వేదం సినిమా తెలుగులో వీరుడొక్కడే సినిమాగా అల్రెడి విడుదలైంది.
ఆ సినిమాలోని ఐదుగురు అన్నదమ్ముల పాయింట్‌తోనే సినిమా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ తమ్ముళ్ళలో ఒకడిగా అవకాయ్ బిర్యాని ఫేమ్ కమల్ కామరాజు నటిస్తున్నాడు. అలాగే మానస, యామినీ భాస్కర్లు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com