కొత్త భాష నేర్చుకుంటున్న కమల్‌హాసన్
Send us your feedback to audioarticles@vaarta.com
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్‌లో 23 ఏళ్ల తర్వాత రూపొందుతోన్న చిత్రం `ఇండియన్ 2`. 1996లో వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కిన `ఇండియన్`కు ఇది సీక్వెల్. లేటెస్ట్ సమాచారం మేరకు ఈ సినిమాలో కొన్ని కీలక సన్నివేశాల్లో కమల్‌హాసన్ పాత్రధారి గుజరాతీ మాట్లాడాల్సి ఉందట. అందుకోసమని కమల్ హాసన్ గుజరాతీ భాషను నేర్చుకుంటున్నాడట. నటుడిగా 60 ఏళ్లు పూర్తి చేసుకున్నప్పటికీ కమల్, మరో భాషను నేర్చుకోవాలనుకోవడం ఆయన కమిట్‌మెంట్‌కు నిదర్శనం. ఈ సీక్వెల్‌లో కమల్ హాసన్‌తో పాటు కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్ తదితరులు నటిస్తున్నారు.
ఇటీవల ఈ సినిమాకు షెడ్యూల్‌ను బోపాల్‌లోని ఓ ఫ్యాక్టరీలో పీటర్ హెయిన్స్ నేతృత్వంలో భారీ యాక్షన్ సీన్‌ను చిత్రీకరించారు. ఇటీవల కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా బ్రేక్ తీసుకున్న యూనిట్ ఇప్పుడు షూటింగ్‌ను స్టార్ట్ చేసింది. ఈ సినిమా కోసం వయసు మళ్లిన సేనాపతిగా కమల్ హాసన్ మరోసారి తెరపై కనపడనున్నారు. కాజల్ అగర్వాల్ కమల్ హాసన్ సరసన నటిస్తుంటే.. సిద్ధార్థ్ జోడిగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. కాజల్ అగర్వాల్ ఈ సినిమా కోసం ప్రత్యేకమైన మార్షల్ ఆర్ట్స్‌ను నేర్చుకుంది. సినిమాలో కమల్ 90 ఏళ్ల వ్యక్తిగా కనపడుతుంటే రకుల్ 80 ఏళ్ల ముసలి బామ్మగా కనపడునుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments