థియేటర్లలో అలరించేందుకు భారతీయుడు సిద్ధం.. ఎప్పుడంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
లోక నాయకుడు కమల్ హాసన్, దిగ్గజ దర్శకుడు శంకర్ కలయికలో 'ఇండియన్-2' చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. 90వ దశకంలో వచ్చిన భారతీయుడు చిత్రానికి ఇది సీక్వెల్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అవినీతి నిర్మూలన ఆధారంగా మూవీని తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా మూవీ విడుదల ఎప్పుడో మేకర్స్ ప్రకటించారు.
అభిమానుల ఎదురు చూపులకు తెరదించుతూ అదిరిపోయే అప్డేట్ తీసుకువచ్చారు. ఈ సినిమాని ఈ ఏడాది జూన్ నెలలో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే కచ్చితమైన తేదీ మాత్రం వెల్లడించలేదు. జూన్ 4వ తేదీతో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ముగియనుంది. ఆ తర్వాత మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే రిలీజ్ తేదీని కూడా అనౌన్స్ చేయనున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ తెలుగు, తమిళ్, హిందీలో విడుదల కానుంది. ఈ మూవీకి సీక్వెల్‌గా 'ఇండియన్ 3' కూడా తెరకెక్కించనున్నట్లు సమాచారం.
కాగా కొన్ని నెలల క్రితం ఈ చిత్రం నుంచి విడుదలైన ఇంట్రో వీడియో అభిమానులను తెగ ఆకట్టుకుంది. ఇందులో మూవీ విజువల్స్ అయితే సూపర్బ్‌గా ఉన్నాయి. రవి వర్మన్ కెమెరా వర్క్ అయితే మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. శంకర్ ట్రేడ్ మార్క్ భారీ సెట్టింగ్స్ స్పష్టంగా చూపించారు. చివర్లో కమల్ "నమస్తే ఇండియా... భారతీయుడు ఈజ్ బ్యాక్" అంటే చెప్పే హైలెట్‌గా నిలుస్తుంది. మొత్తానికి ఒకటిన్నర నిమిషం ఉన్న ఈ ఇంట్రోలో సినిమా ఎలా ఉండబోతుందనేది చూపించారు. దీంతో మూవీపై ప్రేక్షకుల్లో హై భజ్ ఏర్పడింది.
లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాలో సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్ జే సూర్య, బాబీ సింహా, లేట్ వివేక్, ప్రియా భవానీ శంకర్, బ్రహ్మానందం, సముద్రఖని, నెడుముడి వేణు, ఢిల్లీ గణేశ్, మనోబాలా, బాలీవుడ్ నటుడు గుల్షన్ గ్రోవర్ తదితరులు నటించారు. ఇక ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా శ్రీమణి సాహిత్యం సమకూర్చారు. మొత్తంగా మరోసారి భారతీయుడు మ్యాజిక్ రిపీల్ చేసేందుకు కమల్, శంకర్ సిద్ధమయ్యారు. మరి జూన్ నెలలో విడుదల కానున్న ఈ మూవీ ఎలాంటి రికార్డులు బద్ధలు కొడుతుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments