థియేటర్లలో అలరించేందుకు భారతీయుడు సిద్ధం.. ఎప్పుడంటే..?

  • IndiaGlitz, [Saturday,April 06 2024]

లోక నాయకుడు కమల్ హాసన్, దిగ్గజ దర్శకుడు శంకర్ కలయికలో 'ఇండియన్-2' చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. 90వ దశకంలో వచ్చిన భారతీయుడు చిత్రానికి ఇది సీక్వెల్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అవినీతి నిర్మూలన ఆధారంగా మూవీని తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా మూవీ విడుదల ఎప్పుడో మేకర్స్ ప్రకటించారు.

అభిమానుల ఎదురు చూపులకు తెరదించుతూ అదిరిపోయే అప్డేట్ తీసుకువచ్చారు. ఈ సినిమాని ఈ ఏడాది జూన్ నెలలో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే కచ్చితమైన తేదీ మాత్రం వెల్లడించలేదు. జూన్ 4వ తేదీతో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ముగియనుంది. ఆ తర్వాత మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే రిలీజ్ తేదీని కూడా అనౌన్స్ చేయనున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ తెలుగు, తమిళ్, హిందీలో విడుదల కానుంది. ఈ మూవీకి సీక్వెల్‌గా 'ఇండియన్ 3' కూడా తెరకెక్కించనున్నట్లు సమాచారం.

కాగా కొన్ని నెలల క్రితం ఈ చిత్రం నుంచి విడుదలైన ఇంట్రో వీడియో అభిమానులను తెగ ఆకట్టుకుంది. ఇందులో మూవీ విజువల్స్ అయితే సూపర్బ్‌గా ఉన్నాయి. రవి వర్మన్ కెమెరా వర్క్ అయితే మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. శంకర్ ట్రేడ్ మార్క్ భారీ సెట్టింగ్స్ స్పష్టంగా చూపించారు. చివర్లో కమల్ నమస్తే ఇండియా... భారతీయుడు ఈజ్ బ్యాక్ అంటే చెప్పే హైలెట్‌గా నిలుస్తుంది. మొత్తానికి ఒకటిన్నర నిమిషం ఉన్న ఈ ఇంట్రోలో సినిమా ఎలా ఉండబోతుందనేది చూపించారు. దీంతో మూవీపై ప్రేక్షకుల్లో హై భజ్ ఏర్పడింది.

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాలో సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్ జే సూర్య, బాబీ సింహా, లేట్ వివేక్, ప్రియా భవానీ శంకర్, బ్రహ్మానందం, సముద్రఖని, నెడుముడి వేణు, ఢిల్లీ గణేశ్, మనోబాలా, బాలీవుడ్ నటుడు గుల్షన్ గ్రోవర్ తదితరులు నటించారు. ఇక ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా శ్రీమణి సాహిత్యం సమకూర్చారు. మొత్తంగా మరోసారి భారతీయుడు మ్యాజిక్ రిపీల్ చేసేందుకు కమల్, శంకర్ సిద్ధమయ్యారు. మరి జూన్ నెలలో విడుదల కానున్న ఈ మూవీ ఎలాంటి రికార్డులు బద్ధలు కొడుతుందో చూడాలి.

More News

టీఆర్ఎస్‌గా మారనున్న బీఆర్ఎస్.. మాజీ మంత్రి కీలక ప్రకటన..

పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీ గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షోభం ఎదుర్కొంటోంది. ఓవైపు అధికారం కోల్పోవడం..

కొన్ని పత్రికల కథనాలపై ఏపీ ఐపీఎస్ పోలీసుల సంఘం సీరియస్

ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. వైనాట్ 175 అంటూ వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారంతో ప్రజల్లోకి దూసుకెళ్తోంది.

25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరబోతున్నారు.. మంత్రి ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు..

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 25 మంది బీఆర్‌స్ ఎమ్మెల్యేలు త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని తెలిపారు.

TDP-Janasena: ఎన్నికల తర్వాత బీజేపీలో టీడీపీ-జనసేన విలీనం..?

రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నికల ఫలితాల తర్వాత కీలక పరిణామాలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో మరోసారి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.

Kalki 2898AD: ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు క్రేజీ న్యూస్.. 'కల్కి' కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్..!

రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘కల్కి 2898AD(Kalki)’. సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌గా హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కుతున్