జులైలో 'భారతీయుడు 2' విడుదల.. జూన్ 1న ఆడియో లాంఛ్

  • IndiaGlitz, [Monday,May 20 2024]

యూనివ‌ర్సల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్టర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్షన్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్కర‌న్ నిర్మిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘భార‌తీయుడు 2’. వీరిద్దరి కాంబినేష‌న్‌లో 1996లో విడుద‌లైన బాక్సాఫీస్ ద‌గ్గర సరికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేసిన ‘ఇండియన్’ చిత్రాన్ని ‘భార‌తీయుడు’గా విడుదల చేసింది. ఆ మూవీకి సీక్వెల్‌గా ఇప్పుడు ‘భార‌తీయుడు2’ రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే .

భార‌తీయుడు సీక్వెల్ అంటే ఎలాంటి అంచ‌నాలుంటాయో వాటిని మించేలా డైరెక్టర్ శంక‌ర్ 'భార‌తీయుడు2'ను విజువ‌ల్ వండ‌ర్‌గా ఆవిష్కరిస్తున్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడే స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు సేనాప‌తిగా క‌మ‌ల్ హాస‌న్ ప‌వ‌ర్‌ఫుల్ పెర్ఫామెన్స్ ఇవ్వటానికి రెడీ అయ్యారు. ఈ సినిమా శ‌ర‌వేగంగా రూపొందుతోంది. జూలై సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

లేటెస్ట్‌గా ముంబైలోని స్టార్ స్పోర్ట్స్ ఛానల్‌లో ‘భారతీయుడు 2’ ప్రమోషన్స్ వినూత్నంగా ప్రారంభించటం విశేషం. అలాగే జూన్ 1న చెన్నైలో ఈ మూవీ ఆడియో వేడుక ప్రముఖుల సమక్షంలో భారీ ఎత్తున నిర్వహించనున్నారు. మ‌న దేశాన్ని అవినీతి క్యాన్సర్‌లా ప‌ట్టి పీడిస్తోంది. దీన్ని రూపుమాపటానికి సేనాపతి ఈ సీక్వెల్‌లో ఏం చేశారనేది అందరిలో ఆసక్తిని పెంచుతోంది.

క‌మ‌ల్ హాస‌న్ టైటిల్ పాత్రలో న‌టిస్తోన్న ఈ చిత్రంలో సిద్ధార్థ్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్రియాభ‌వానీ శంక‌ర్‌, ఎస్‌.జె.సూర్య, బాబీ సింహ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్రల్లో న‌టిస్తున్నారు. ర‌వివ‌ర్మన్ సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి అనిరుద్ ర‌విచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఎ.శ్రీక‌ర ప్రసాద్ ఎడిట‌ర్‌, ప్రొడ‌క్షన్ డిజైన‌ర్‌గా టి.ముత్తురాజ్ వ‌ర్క్ చేస్తున్నారు. బి.జ‌య‌మోహ‌న్‌, క‌బిల‌న్ వైర‌ముత్తు, ల‌క్ష్మీ శ‌ర‌వ‌ణ‌కుమార్‌ల‌తో క‌లిసి డైరెక్టర్ శంక‌ర్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. లైకా ప్రొడ‌క్షన్స్‌, రెడ్ జైంట్ మూవీస్ ఈ భారీ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి.

More News

ఒంగోలులో అల్లరిమూకలపై కాల్పులు.. అసలు ఏం జరిగిందంటే..?

ఏపీలో పోలింగ్ ముగిసినా కూడా ఎక్కడో చోట హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఎన్నికల సంఘంతో పాటు పోలీసులు అప్రమత్తమయ్యారు. భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.

రేవ్ పార్టీలో పట్టుబడ్డ తెలుగు నటీనటులు.. సంబంధం లేదంటున్న హేమ..

బెంగుళూరులో రేవ్ పార్టీని పోలీసులు భ‌గ్నం చేశారు. ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలోని జీఆర్‌ ఫామ్‌హౌస్‌లో బర్త్‌ డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్‌ పార్టీని నిర్వహించారు.

జగన్ ఘోరంగా ఓడిపోతారు.. ప్రశాంత్ కిషోర్ మరోసారి కీలక వ్యాఖ్యలు..

ఏపీలో ఎంతో ఉత్కంఠగా సాగిన పోలింగ్ ముగిసి వారం రోజులు అవుతుంది. దీంతో తామే అధికారంలోకి వస్తామని ఇటు వైసీపీ, అటు టీడీపీ కూటమి లెక్కలు వేసుకుంటున్నాయి.

హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు దుర్మరణం..

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (Ebrahim Raisi) హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందడం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. అధ్యక్షుడితో పాటు

తెలంగాణ మంత్రివర్గ సమావేశం రద్దు.. ఎందుకంటే..?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర ఎన్నిక‌ల సంఘం షాక్ ఇచ్చింది. మంత్రివర్గ సమావేశానికి అనుమతి నిరాకరించింది. గ‌త రెండు రోజుల క్రితం కేబినెట్ మీటింగ్ ఉంటుందంటూ ప్రభుత్వం ప్రకటించింది.