ముగ్గురు హీరోయిన్స్‌తో కమల్ హాసన్
Send us your feedback to audioarticles@vaarta.com
లోక నాయకుడు కమల్‌హాసన్ ఇప్పుడు ‘ఇండియన్ 2’ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా చిత్రీకరణ ముగియక ముందే లొకేషన్లో ప్రమాదం జరగడం, ఆ గొడవ సద్దుమణగక ముందే కరోనా ప్రభాం ప్రారంభం కావడంతో సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి. దీంతో ఓ దశలో ఇండియన్ 2 సినిమా షూటింగ్ ఆగిపోయిందంటూ వార్తలు కూడా వినిపించాయి. అయితే లైకా సంస్థ సినిమా లొకేషన్ మార్చి చిత్రీకరణకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
దీని తర్వాత కమల్‌హాసన్ ‘తలైవన్ ఇరిక్కిరాన్’ అనే సినిమాలో నటించబోతున్నాడని సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు ప్రారంభమయ్యాయట. అంతే కాకుండా విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కూడా ఇందులో ఓ కీలక పాత్రలో నటించబోతున్నాడని అంటున్నారు. లేటెస్ట్ సమాచారం మేరకు ఈ చిత్రంలో కమల్ హాసన్ జతగా ముగ్గురు హీరోయిన్స్ నటించబోతున్నారని టాక్. అందులో కమల్ హాసన్ ‘క్షత్రియ పుత్రుడు’లో నటించిన సీనియర్ తార రేవతి ఒకరు కాగా, ‘విశ్వరూపం’లో నటించిన పూజా కుమార్, ఆండ్రియా ఈ చిత్రంలో నటించనున్నట్టు కోలీవుడ్ టాక్. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత ఈ సినిమాకు సంబంధించిన పనులను ముమ్మరం చేయబోతున్నారట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com